ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు టైటిల్ ఫెవరెట్ గా వెళ్లిన భారత జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరుకోకుండానే సూపర్ 12 స్టేజ్ నుండే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఏ టోర్నీని రెండు పెద్ద ఓటములతో ప్రారంభించిన భారత్ ఆ తర్వాత పుంజుకున్న ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా ఓటములతో జట్టు బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ సమస్యలను ఎత్తి చూపించాడు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ముఖ్యంగా పవర్‌ప్లే ఓవర్లలో భారత్ బ్యాటింగ్ విధానం మారాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఓడిన రెండు మ్యాచ్ లలో భారత బ్యాటర్లు మంచి ఆరంభాని అందించలేకపోయారు. ఇప్పుడు ఆ విధానం మారాలి. అలాగే ఫీల్డింగ్ అద్భుతంగా చేసే ఆటగాళ్లు జట్టులో ఉండాలి. ఇప్పుడు ఉన్న భారత జట్టును పరిశీలిస్తే, 3-4 అత్యుత్తమ ఫిల్డర్లు మినహా ఎక్కువ మంది నమ్మకస్థులు లేరు. కాబట్టి ఫిల్డింగ్ లో ఆటగాళ్లకు ఎక్కువ నైపుణ్యం కావాలి అని తెలిపారు. ఈ కారణాల వల్లే భారత్ పెద్ద జట్ల పై పరుగులు చేయలేకపోతుంది అని పేర్కొన్నారు.