NTV Telugu Site icon

Gautam Gambhir: నేను ఏ ఆటగాడి భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయను..

Bir

Bir

Gautam Gambhir: సిడ్నీ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ నేరుగా మీడియా సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. జట్టులో సీనియర్‌ ఆటగాళ్లైన కోహ్లీ, రోహిత్‌పై కీలక కామెంట్స్ చేశాడు. కోహ్లీ, రోహిత్ ఫామ్ గురించి తనకు ఆందోళన అవసరం లేదు.. వారు పరుగులు చేయడానికి ఇంకా ఆకలితో ఉన్నారని తెలిపాడు. నేను ఏ ఆటగాడి భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయడం లేదు.. అది వారి ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందన్నారు. వారిలో తపన, నిబద్ధత ఉంటే.. వారు భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తారని గంభీర్ పేర్కొన్నాడు.

Read Also: Nara Lokesh: నా ఉద్యోగం తీయించేలా ఉన్నావే.. విద్యార్థితో లోకేశ్‌ ఛలోక్తి!

నేను ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉంటాను.. అరంగేట్రం చేసిన ఆటగాడైనా.. 100 టెస్టులు ఆడిన ప్లేయరైనా ఒకేలా ఉంటాను అని కోచ్ గంభీర్ తెలిపారు. కేవలం జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం వల్లే సానుకూల ఫలితం రాలేదని నేను చెప్పను.. కానీ, గెలిచే అవకాశం ఉండే.. అయినా మాకు ఐదుగురు బౌలర్లతో కూడిన మంచి జట్టు ఉంది. ఏ ఒక్కరిపై తాము ఆధారపడం.. మేము ఇక్కడ కేవలం సిరీస్‌ ఓడిపోయాం అని టీమిండియా హెచ్ కోచ్ చెప్పాడు. మెల్‌బొర్న్‌ చివరి సెషన్‌లో సమష్టిగా పోరాడితే.. ఆసీస్‌పై ఒత్తిడి పెరుగుతుండే..ఈ మ్యాచ్‌లో కూడా గెలిచే అవకాశలు వచ్చాయి.. తొలి ఇన్నింగ్స్‌లో 181 కొట్టినా ఆధిక్యం దక్కింది.. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో 250 లేదా 300 టార్గెట్‌ ఇస్తే పక్కా విజయం సాధించే వాళ్లం.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ లోపమని నేను తప్పుపట్టను.. మొత్తంగా మా జట్టు ఇంకా మెరుగుపడాల్సి ఉంది అని గౌతమ్ గంభీర్ వెల్లడించారు.

Read Also: Vishwambhara : యంగ్ హీరోకి పోటీగా రానున్న మెగాస్టార్ !

అయితే, మా జట్టులో చాలా మంది మా కుర్రాళ్లకు ఇది తొలి సిరీస్.. చాలా కఠిన పరీక్షను వారు ఎదుర్కొన్నారని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు. మహ్మద్ సిరాజ్‌ అద్భుతమైన పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాడు.. బుమ్రా అద్భుతంగా ఆడాడు.. జైస్వాల్‌ పరుగులు కొట్టాడని చెప్పుకొచ్చాడు. ఇక, జట్టు భవిష్యత్తు గురించి మాట్లాడటం పద్దతి కాదు.. మరో టెస్టు సిరీస్‌కు ఐదు నెలల సమయం ఉందని అతడు పేర్కొన్నాడు. కాగా, సిడ్నీ టెస్టులో ఓటమితో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని టీమిండియా 1-3 తేడాతో కోల్పోయింది. 162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 27 ఓవర్లలోనే నాలుగు వికెట్లను కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా స్కాట్ బోలాండ్, ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌గా జస్‌ప్రీత్ బుమ్రా అవార్డులను దక్కించుకున్నారు.

Show comments