Site icon NTV Telugu

Kohli-Rohit: రోహిత్-కోహ్లీలు ఇలానే రాణించాలని కోరుకుంటున్నా.. కోచ్ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Rohit Sharma Virat Kohli

Rohit Sharma Virat Kohli

టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను విమర్శిస్తాడనే ఆరోపణలు ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కోల అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్లో ఇద్దరూ ఇలాగే స్థిరంగా రాణించాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు. రోహిత్-కోహ్లీలు ప్రపంచ స్థాయి బ్యాటర్లు అని, ఈ విషయాన్ని తాను చాలాసార్లు చెప్పానన్నాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒకే రకమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉండాలనే అభిప్రాయంను తాను ఏకీభవించను అని గంభీర్ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రో-కోలు రాణించిన విషయం తెలిసిందే.

Also Read: Most Popular Smartphone: ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదే.. టాప్ 10లో ఊహించని ఫోన్‌లు!

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రపంచ స్థాయి బ్యాటర్లు. ఈ విషయాన్ని నెను చాలా సార్లు చెప్పా. రో-కోలు వన్డేలలో జట్టుకు ఎంతో అవసరం. సుదీర్ఘ కాలంగా ఇద్దరూ సత్తా చాటుతున్నారు. ఇదే స్థిరత్వాన్ని వన్డే ఫార్మాట్లో కొనసాగించాలని కోరుకుంటున్నా. ఇది డ్రెస్సింగ్‌ రూమ్‌కు ఎంతో మేలు చేస్తుంది’ అని అన్నాడు. రో-కోలు టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ కావడానికి గౌతీనే కారణం అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గంభీర్ ఒత్తిడి కారణంగానే రో-కోలు వీడ్కోలు చెప్పారని వదంతులు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు దిగ్గజాలపై గౌతీ ప్రశంసలు కురిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Exit mobile version