Vishal Marriage : ప్రభాస్ పెళ్లి తర్వాతే తను చేసుకుంటానన్న విశాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishal Marriage : తమిళ చిత్రసీమలో వివాదాస్పద నటుల్లో విశాల్ ఒకరు. నటీనటుల సంఘం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ పక్కన పెడితే విశాల్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. 2004లో విడుదలైన ‘చెల్లామె’ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసిన విశాల్ సృధికోళి(తెలుగులో పందెం కోడి) సినిమాతో యాక్షన్ హీరోగా అవతారమెత్తాడు. యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న విశాల్ ఇటీవల ఆశించిన విజయాలను అందుకోలేక పోతున్నాడు. ఈ విషయంలో ప్రస్తుతం విశాల్ ‘లాఠీ’ సినిమాతో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. డిసెంబర్‌లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి అభిమానుల నుంచి విశేష స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సందర్భంలో విశాల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ పలు విషయాలు మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో విశాల్ తన పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ముందుగా ప్రభాస్ పెళ్లి చేసుకోనివ్వండి అంటూ సమాధానమిచ్చాడు. అతని పెళ్లి రోజునే నేను పెళ్లి చేసుకుంటాను అని విశాల్ చెప్పాడు. అలాగే నటుడు ఆర్య పెళ్లి చేసుకుంటే నేను కూడా పెళ్లి చేసుకుంటాను. అయితే ఆర్యకు పెళ్లి అయి ఇప్పుడు ఓ బిడ్డ కూడా ఉందని అభిమానులు విమర్శిస్తున్నారు.
Read Also: Javed Akhtar : బాలీవుడ్ లిరికిస్ట్ జావేద్ అక్తర్‌కు కోర్టు సమన్లు.. హాజరు కావాలంటూ ఆదేశాలు
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
పందెం కోడి, డిటెక్టీవ్, అభిమన్యుడు సినిమాల ద్వారా విశాల్ తెలుగు వారికి కూడా సుపరిచితమే. ఆ సినిమాలు విశాల్ కు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో విశాల్ తన సినిమాలన్నింటినీ అటు తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటాడు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కి చెందిన అనూష అనే అమ్మాయిని విశాల్ పెళ్లి చేసుకుంటున్నాడని వార్త ప్రచారం జరిగింది. కానీ.. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. పెళ్లి మాత్రం ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ నటి అభినయను పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ వీటిలో ఎంత నిజం ఉందో తెలీదు. 45 ఏళ్ల విశాల్ ఇప్పటి వరకూ మళ్లీ పెళ్లి టాపిక్ ఎత్త లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకున్న విశాల్.. కొన్నింటికి మాత్రం సమాధానం దాటవేశాడు. ఫైనల్‌గా తన పెళ్లిని.. ప్రభాస్ పెళ్లి తో ముడిపెట్టి తప్పించుకున్నాడు.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!