Gautam Gambhir: భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మరోసారి మాజీ క్రికెటర్స్ సీరియస్ అవుతున్నారు. టీమిండియా ఓటమికి కారణం గంభీర్ నిర్ణయాలే అంటూ మండిపడుతున్నారు. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఘోరంగా సూర్య సేన ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి కారణం గౌతమ్ గంభీరని.. అతడు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు సీనియర్ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. తుది జట్టులో అర్షదీప్ లేకపోవడం, బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంతో జట్టు ఓడిందన్నారు. టి20 మ్యాచ్ లో కచ్చితంగా అర్షదీప్ ఉండాల్సిందేనన్నారు.
Read Also: Wanaparthy: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను మట్టుబెట్టిన భార్య..
అర్ష్‌దీప్ సింగ్ కచ్చితంగా తుది జట్టులో ఉండాలి అని మాజీ క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నారు. కనీసం మూడో టీ20లోనైనా తుది జట్టులోకి తీసుకోవాలి.. మరీ ఎక్కువగా బ్యాటర్లతోనే వెళ్లినా మ్యాచులు గెలవడం చాలా కష్టం అన్నారు. భారత్ కూడా ఇలా అదనంగా బ్యాటర్లను తీసుకొని ప్రయోగాలు చేస్తోంది. ఇదంతా వరల్డ్ కప్ కోసమే అయినప్పటికీ.. బౌలింగ్ కూడా కీలకమే అన్నారు. మెగా టోర్నమెంట్లో గెలవాలంటే కేవలం బ్యాటింగ్‌తోనే సాధ్యం కాదన్నారు. సరైన జట్టు కూర్పుతో బరిలోకి దిగాల్సి ఉంటుందని తెలిపారు. రెండో టీ20లో టీమిండియా బౌలర్లు తేలిపోవడానికి కారణం స్కోరు బోర్డుపై తగినన్ని రన్స్ లేకపోవడమేనన్నారు. ఇంకొన్ని రన్స్ ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేది అని వెల్లడించారు.