ఐపీఎల్‌కు మరో ఇంగ్లండ్ ఆటగాడు దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ ఓటమి ఇంగ్లండ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు టెస్టులకు కాకుండా టీ20లకు ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరం కావాలని పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్ మెగా వేలానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది ఐపీఎల్ అరంగేట్రం చేయాలని అతడు భావించినా యాషెస్ సిరీస్ ఓటమి కారణంగా తన జాతీయ జట్టుకు చేయాల్సింది చాలా ఉందని… అందుకోసం తాను ఎంతటి త్యాగమైనా చేస్తానంటూ ఐపీఎల్ వేలంను ఉద్దేశించి రూట్ మాట్లాడాడు.
Read Also: చరిత్ర సృష్టించిన ఐర్లాండ్… విదేశీ గడ్డపై తొలి వన్డే సిరీస్ విజయం
Also Read
- Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
- MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్‌లో 50+ సిక్సర్లు..
- India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
- IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
అయితే జో రూట్ బాటలోనే ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని భావించాడు. స్వదేశంలో వచ్చే క్రికెట్ సీజన్ కోసం మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలనే లక్ష్యంతో స్టోక్స్ ఐపీఎల్‌లో ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాడు. గతంలో ఐపీఎల్‌లో బెన్ స్టోక్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇటీవల రిటెన్షన్ ప్రక్రియలో రాజస్థాన్ జట్టు బెన్ స్టోక్స్‌ను వదిలేసింది. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన రెండో ఫేజ్ ఐపీఎల్‌లో స్టోక్స్ ఆడలేదు. దీంతో జట్టు విజయావకాశాలు దెబ్బతిన్నాయి. ఈ కారణాలతోనే రాజస్థాన్ జట్టు స్టోక్స్‌ను వదులుకున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్‌లో 50+ సిక్సర్లు..
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!