IPL 2022: హాఫ్ సెంచరీలతో రాణించిన హుడా, బదోనీ.. లక్నో స్కోర్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో కొత్త జట్ల సమరం ఆసక్తికరంగా సాగింది. సోమవారం రాత్రి లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో టీమ్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. గుజరాత్ బౌలర్ మహ్మద్ షమీ ఈ వికెట్ సాధించాడు. షమీ విజృంభించడంతో లక్నో టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డికాక్ (7), ఎవిన్ లూయిస్ (10), మనీష్ పాండే (6) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లక్నో జట్టు కనీసం 100 పరుగులైనా చేస్తుందా అనే అనుమానాలు కలిగాయి.
అయితే దీపక్ హుడా (55), ఆయుష్ బదోనీ (54) ఇద్దరూ తమ టీమ్‌ను ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఆడారు. 10 ఓవర్ల తర్వాత ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. కృనాల్ పాండ్యా (21) వేగంగా ఆడటంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ 3, వరుణ్ ఆరోన్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నాడు.
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
- Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?