ఐపీఎల్ 2022 లో 10 జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. దాంతో టైటిల్ కోసం పెరిగిన పోటీలో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని జట్లు దానికి తగినట్లు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన జట్లు.. మెగా వేలంలో కొత్తగా ఎవరిని తీసుకోవాలని అనే ఆలోచనలో ఉన్నాయి. అయితే గత ఐపీఎల్ సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరి నుండి మొదటి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కొచ్చిన్ స్టాఫ్ ను తీసుకుంది.
ఇక దానిలో ఐపీఎల్ 2022 నుంచి జట్టుకు పేస్ బౌలింగ్ కోచ్ గా డేల్ స్టెయిన్ ను నియమించినట్లు సన్ రైజర్స్ యాజమాన్యం ప్రకటించింది. అలాగే బ్యాటింగ్ కోచ్ గా బ్రియాన్ లారా ను నియమించినట్లు ఇప్పటికే సన్ రైజర్స్ ప్రకటించింది. అయితే 2013 నుండి 2015 వరకు స్టెయిన్ హైదరాబాద్ జట్టుకు బౌలర్ గా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.