ఈ ఏడాది నుండి ఐపీఎల్ లోకి రెండు కొత్త జట్లు రానున్న విషయం తెలిసిందే. లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీల కోసం అక్టోబర్‌లో జరిగిన వేలంలో.. సీవీసీ క్యాపిటల్ సంస్థ అహ్మదాబాద్ ను 5625 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆ తర్వాత ఈ సంస్థ చుట్టూ బెట్టింగ్ ఉచ్చు బిగుసుకుంది. అయితే ఈ కంపెనీకి బెట్టింగ్ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బును ఇప్పుడు వీరు ఇందులో ఉపయోగిస్తున్నారు అని.. కాబట్టి వారిని జరిగిన ఐపీఎల్ వేలం నుండి తప్పించాలని ఆరోపించారు.
అయితే ఈ వార్తల పై బీసీసీఐ స్పందిస్తూ… ఓ విచారణ కమిటీని వేసింది. కానీ తాజాగా బీసీసీఐ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సీవీసీ కంపెనీకి క్లీన్ చిట్ ఇచ్చిందని.. దాంతో బోర్డు ఇప్పుడు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ ఇచ్చి అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకునేందుకు వీలు కల్పించడానికి సిద్ధంగా ఉందని సమాచారం.