CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. 18 ఏళ్ల పాటు సీఎస్కేకు హెడ్ కోచ్‌గా సేవలందించిన న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలిగాడు. ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఇయాన్ మోర్గాన్, మైక్ హస్సీ వంటి దిగ్గజాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సీఎస్కే మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ మాత్రం టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్ అంటున్నాడు.
సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా ప్రస్తుతం ఆర్సీబీ మెంటర్‌గా ఉన్న దినేశ్ కార్తీక్‌ను నియమించడమే సరైన ఎంపిక అని మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా చెన్నైతో కార్తీక్‌కు ఉన్న అనుబంధం కారణంగా అతడు ఈ బాధ్యతకు సరైన వ్యక్తి అని పేర్కొన్నాడు. చెన్నైలో జన్మించిన కార్తీక్ తమిళనాడు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన విషయాన్ని గుర్తుచేశాడు. ‘హెడ్ కోచ్‌గా దినేశ్ కార్తీక్ పేరు కూడా వినిపిస్తోంది. ఇలాంటి బాధ్యతను చేపట్టడానికి డీకే సిద్ధంగా ఉన్నాడని నేను భావిస్తున్నాను. సీఎస్కే లాంటి ఫ్రాంచైజీకి లోకల్ టచ్ ఉండటం చాలా ముఖ్యం. అందుకే దినేశ్ కార్తీక్ పర్ఫెక్ట్ వ్యక్తి’ అని హేడెన్ పేర్కొన్నాడు.
Also Read
- Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- India vs Afghanistan: భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
అంతర్జాతీయ కోచ్‌లను నియమించుకోవడం కూడా తప్పు కాదని, అయితే సీఎస్కే వంటి జట్టుకు చెన్నైతో అనుబంధం ఉన్న వ్యక్తి హెడ్ కోచ్‌గా ఉంటే ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుందని హేడెన్ అభిప్రాయపడ్డాడు. అభిమానులు, జట్టు సంస్కృతి, ప్రాంతీయ వాతావరణంపై కార్తీక్‌కు మంచి అవగాహన ఉండటం అతడికి ప్లస్ పాయింట్‌గా మారుతుందని చెప్పాడు. కార్తీక్‌కు కోచింగ్, జట్టు నిర్వహణ విషయంలోనూ అనుభవం పెరిగిందని హేడెన్ చెప్పాడు. గత మూడు సంవత్సరాలుగా ఆర్సీబీ సపోర్ట్ స్టాఫ్‌లో భాగంగా ఉన్న కార్తీక్.. ఆ జట్టు వరుసగా 2025, 2026 ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన సమయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అనుభవం సీఎస్కేకు ఉపయోగపడుతుందని హేడెన్ అభిప్రాయపడ్డాడు.
కొత్త హెడ్ కోచ్ ఎంపిక విషయంలో సీఎస్కే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హేడెన్ సూచించాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్, ఎంఎస్ ధోనీ కలయిక సీఎస్కేకు అపారమైన విజయాన్ని అందించిందని గుర్తుచేశాడు. వారి భాగస్వామ్యమే జట్టు విజయాల్లో కీలకమైన బలమైన వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నాడు. ‘ఫ్లెమింగ్ సూపర్. అతడి పని తీరు బాగుంది. ఎంఎస్ ధోనీతో కలిసి ఆయన బలమైన వ్యవస్థను నిర్మించాడు. ముంబై ఇండియన్స్‌తో సమానంగా టైటిళ్లు సాధించే స్థాయికి జట్టును తీసుకెళ్లిన ఆ కాలం గొప్ప వారసత్వాన్ని మిగిల్చింది. ఇప్పుడు కొత్త కోచ్‌ను ఎంచుకోవడం ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఫ్రాంచైజీ సరైన వ్యక్తిని ఎంపిక చేస్తుందని ఆశిస్తున్నాను’ అని హేడెన్ పేర్కొన్నాడు.
మరోవైపు సీఎస్కే భవిష్యత్తులో ఎంఎస్ ధోనీ పాత్ర ఏంటి? అన్నదీ కీలకంగా మారింది. 2026 ఐపీఎల్ సీజన్లో ధోనీ సీఎస్కే తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ జట్టులో అతడి ప్రభావం మాత్రం కొనసాగుతోంది. కొత్త హెడ్ కోచ్ ఎంపికలో ధోనీ అభిప్రాయం కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సీఎస్కే ముందు అనేక ఆప్షన్లు ఉన్నప్పటికీ.. మాథ్యూ హేడెన్ మాత్రం చెన్నైకి చెందిన కార్తీక్‌నే సరైన ఎంపికగా సూచిస్తున్నాడు. ఫ్రాంచైజీ చివరకు ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?