Umpire Nitin Menon: అనుకూల నిర్ణయాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.. భారత ఆటగాళ్లపై అంపైర్ నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Umpire Nitin Menon Makes Sensational Comments on India Star Players: టీమిండియా స్టార్ ఆటగాళ్లపై భారత అంపైర్ నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ఆటగాళ్లు అంపైరింగ్ నిర్ణయాలు తమకు అనుకూలంగా వచ్చేలా ఒత్తిడి తీసుకొస్తారన్నాడు. 50-50 నిర్ణయాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు భారత స్టార్స్ ప్రయత్నిస్తారని పేర్కొన్నాడు. తన దృష్టి ఎప్పుడూ అంపైరింగ్ మీదే ఉంటుందని ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ నితిన్ మీనన్ చెప్పుకొచ్చాడు. భారత్ నుంచి ఐసీసీ ప్యానల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అంపైర్లలో నితిన్ మీనన్ ఒకడన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ 2023లో చివరి మూడు టెస్ట్‌లకు నితిన్ మీనన్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ క్రీడా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సొంత గడ్డపై ఆడుతున్నపుడు భారత జట్టుపై భారీ అంచనాలు ఉంటాయి. మైదానం మొత్తం అభిమానులతో నిండిపోతుంది. దాంతో భారత స్టార్లు ఆన్ ఫీల్డ్ అంపైర్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. 50-50గా ఉన్నప్పుడు నిర్ణయాలు తమకు అనుకూలంగా వచ్చేలా ఒత్తిడి తెస్తారు. అయితే ఒత్తిడి కూడా మేం నియంత్రణలో ఉండి.. దృష్టి మరలకుండా చూసుకుంటాం’ అని నితిన్ చెప్పాడు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
- Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్‌కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
- Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్‌కు కొత్త మలుపు
‘ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి నేను బలంగా ఉన్నానని నమ్మితే.. ప్లేయర్స్ సృష్టించే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. ఐసీసీ ప్యానల్‌లో స్వదేశంలో భారత్ తరఫున సేవలందించడం పెద్ద బాధ్యత. ఈ ప్యానల్‌లో చేరినప్పుడు నాకు అనుభవం లేదు. కానీ గత మూడేళ్లుగా అంపైర్‌గా ఎంతో ఎదిగాను. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో బాధ్యతలు చేపట్టా. ఇది గొప్ప సిరీస్ అవుతుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు అంపైరింగ్ చేయాలనేది నా కల. ఇప్పుడు అది నెరవేరబోతోంది. ‘బాజ్‌బాల్’ అంటే ఏమిటో చూడగలిగాను. ఆస్ట్రేలియా అద్భుతమైన బౌలింగ్ లైనప్‌ని కలిగి ఉంది. ఇంగ్లండ్ ఆడే విధానం టెస్ట్ క్రికెట్‌ను పునర్నిర్వచించడమే’ అని నితిన్ మీనన్ పేర్కొన్నాడు.
Also Read:Virat Kohli Net Worth: సంపాదనలోనూ ‘కింగే’.. విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!