Cheteshwar Pujara: పుజారా చెత్త రికార్డ్.. గవాస్కర్ తర్వాత ఇతడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheteshwar Pujara Creates Worst Record After Sunil Gavaskar: ఈమధ్య ఛటేశ్వర్ పుజారా టెస్టుల్లో ఏమంత ఆశాజనకంగా రాణించడం లేదు. ఎప్పుడో ఒకసారి బ్యాట్‌ని ఝుళపిస్తున్నాడే తప్ప, నిలకడగా ఆడటం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న బార్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లోనూ అంత గొప్ప ప్రదర్శన కనబర్చడం లేదు. సోసోగా రాణిస్తున్నాడంతే! ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు బంతులు ఎదుర్కొన్న పుజారా.. లియోన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు తన పేరిట ఒక చెత్త రికార్డ్‌ను లిఖించుకున్నాడు. ఒక బౌలర్ చేతిలో ఎక్కువసార్లు ఔటైన బ్యాటర్ జాబితాలో చేరాడు. పుజారాను నాథన్ లియోన్ ఔట్ చేయడం ఇది 12వ సారి. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా పుజారాను 12 సార్లు చేశాడు. ఇంతకుముందు అండర్వుడ్ చేతిలో సునీల్ గవాస్కర్ 12 సార్లు ఔట్ అవ్వగా.. ఆయన తర్వాత ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన రెండో భారతీయ క్రికెటర్‌గా పుజారా నిలిచాడు.
Student Sathvik Case: సాత్విక్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు.. అదుపులో ఆ నలుగురు
Also Read
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- 2027 World Cup: వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
- Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్‌లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
- Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక... బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఓపెనర్స్‌గా వచ్చిన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మొదట్లో బాగానే మెరుపులు మెరిపించారు కానీ, అంతలోనే పెవిలియన్ చేరారు. వీరి తర్వాత మిగతా బ్యాటర్లు కూడా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. కోహ్లీకి ఇది హోమ్‌గ్రౌండ్‌లో 200వ మ్యాచ్ కావడంతో.. అతడు తప్పకుండా విజృంభిస్తాడని అనుకున్నారు. కానీ, అతడు కూడా నిరాశపరిచాడు. కేవలం 22 పరుగులకే ఔట్ అయ్యాడు.
Kidney For Sale: భరణం కోసం భార్య వేధింపులు.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!