Cheteshwar Pujara: టీ20 వరల్డ్‌కప్ తుది జట్టులో ఆ ఇద్దరూ ఉండాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheteshwar Pujaga Gives His Verdict On Rishabh Pant vs Dinesh Karthik: టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరికి చోటు దక్కితే బాగుంటుందన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో సీనియర్ ఆటగాళ్లు సైతం, ఎవరిని తుది జట్టుకి ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. తాజాగా భారత వెటరన్ క్రికెటర్ చెతేశ్వర్ పుజారా కూడా తన అభిప్రాయాన్ని తెలిపాడు. వరల్డ్‌కప్ తుది జట్టులో పంత్, దినేశ్ కార్తిక్ ఇద్దరూ ఉండాలని అన్నాడు. 5, 6, 7వ స్థానాల్లో ఎవర్ని ఎంపిక చేయాలన్న ప్రస్తావన వస్తే.. తాను వరుసగా పంత్, హార్దిక్ పాండ్యా, కార్తీక్‌కు అవకాశం ఇస్తానన్నాడు. భారత బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారాలన్నాడు. ఇక భారత్ అదనపు బౌలింగ్ ఎంపిక కావాలంటే.. పంత్ స్థానంలో దీపక్ హుడాను ప్లేయింగ్ ఎలెవెల్‌లోకి తీసుకుంటే బాగుంటుందన్నాడు. ఒకవేళ అతడ్ని తుది జట్టులో ఆడించినట్లైతే, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి పంపితే బాగా ఆడుతాడని పుజారా చెప్పుకొచ్చాడు.
కాగా.. వరల్డ్‌కప్ తుది జట్టులో పంత్, దీపక్‌లలో ఎవరికి చోటిస్తే బాగుంటుందన్న విషయంపై చాలా రోజుల నుంచే చర్చలు జోరుగా సాగుతున్నాయి. వన్డే, టెస్టుల్లో పంత్ అదరగొడుతున్నాడు కానీ.. అదే జోరుని టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. ఆసియా కప్‌లోనూ ఇతనికి ఆడే అవకాశాలొచ్చినా, తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక దినేశ్ కార్తీక్ విషయానికొస్తే.. మొన్న జరిగిన ఐపీఎల్ నుంచి ఇతను ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తనకు అవకాశం లభించినప్పుడల్లా బ్యాట్‌ను ఝుళపించాడు. కీపర్‌గానూ అదరగొట్టాడు. కాకపోతే, ఇతనికి ఆసియా కప్‌లో ఆడేందుకు పెద్దగా అవకాశాలు రాలేదు. అవకాశాలొచ్చినా రిషభ్ పెద్దగా రాణించలేదు కాబట్టి.. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే చెతేశ్వర్ పుజారా పై విధంగా స్పందించాడు. అలాగే.. భువనేశ్వర్ కుమార్‌ని కూడా టీ20 వరల్డ్ కప్ తుది జట్టులో తీసుకోవాల్సిందేనని, అతడో టాప్ క్వాలిటీ బౌలర్ అని కితాబిచ్చాడు.
Also Read
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
- BCCI Partners: బీసీసీఐతో చాట్‌జీపీటీ, క్యాంపా, ఎస్బీఐ లైఫ్ ఒప్పందం.. రూ.130 కోట్లకు పైగా డీల్!
- IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
- Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
-
Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!