NTV Telugu Site icon

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు..? స్పందించిన చీఫ్‌ సెలెక్టర్

టీమిండియాలో గత కొంతకాలంగా జరుగుతోన్న పరిణామాలపై అనేక రకాల ప్రచారం జరిగింది.. విరాట్‌ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత.. బీసీసీఐ, టీమిండియాలోని కొందరు ఆటగాళ్లతో విరాట్‌ కోహ్లీకి విబేధాలు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి.. అయితే, ఈ పుకార్లపై తాజాగా స్పందించారు భారత జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ… విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆయన.. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు.. అవన్నీ పనిలేని వ్యక్తులు పుట్టించే పుకార్లు మాత్రమేనని అభిప్రాయడ్డారు..

Read Also: బస్సు ప్రమాదంలో 22 మంది మృతి.. డ్రైవర్‌కు 190 ఏళ్ల జైలు శిక్ష..

విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోకూడదని మేం కోరాం.. అయితే అతను మా మాట వినిపించుకోలేదన్న ఆయన.. వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతో వన్డే ఫార్మాట్ బాధ్యతలు కూడా రోహిత్ శర్మకు అప్పగించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఎలాంటి విభేదాలు, వైరం లేదు.. ఇలాంటి వార్తలన్నీ చూసి మేం నవ్వుకుంటూ ఉంటాం.. వారిద్దరూ ఓ ఫ్యామిలీలా ఉంటారని స్పష్టం చేశారు. భవిష్యత్తు గురించి, రాబోయే ఐసీసీ టోర్నీల గురించి కూడా వాళ్లిద్దరూ ప్లాన్ చేసుకున్నారు.. ఇప్పుడు జట్టులో వాతావరణం చాలా బాగుందని తెలిపారు భారత జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ.