రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు..? స్పందించిన చీఫ్ సెలెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియాలో గత కొంతకాలంగా జరుగుతోన్న పరిణామాలపై అనేక రకాల ప్రచారం జరిగింది.. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత.. బీసీసీఐ, టీమిండియాలోని కొందరు ఆటగాళ్లతో విరాట్ కోహ్లీకి విబేధాలు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి.. అయితే, ఈ పుకార్లపై తాజాగా స్పందించారు భారత జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ… విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆయన.. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు.. అవన్నీ పనిలేని వ్యక్తులు పుట్టించే పుకార్లు మాత్రమేనని అభిప్రాయడ్డారు..
Read Also: బస్సు ప్రమాదంలో 22 మంది మృతి.. డ్రైవర్‌కు 190 ఏళ్ల జైలు శిక్ష..
Also Read
- IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోకూడదని మేం కోరాం.. అయితే అతను మా మాట వినిపించుకోలేదన్న ఆయన.. వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతో వన్డే ఫార్మాట్ బాధ్యతలు కూడా రోహిత్ శర్మకు అప్పగించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఎలాంటి విభేదాలు, వైరం లేదు.. ఇలాంటి వార్తలన్నీ చూసి మేం నవ్వుకుంటూ ఉంటాం.. వారిద్దరూ ఓ ఫ్యామిలీలా ఉంటారని స్పష్టం చేశారు. భవిష్యత్తు గురించి, రాబోయే ఐసీసీ టోర్నీల గురించి కూడా వాళ్లిద్దరూ ప్లాన్ చేసుకున్నారు.. ఇప్పుడు జట్టులో వాతావరణం చాలా బాగుందని తెలిపారు భారత జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ.
తాజావార్తలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!