బస్సు ప్రమాదంలో 22 మంది మృతి.. డ్రైవర్‌కు 190 ఏళ్ల జైలు శిక్ష..

డ్రైవర్‌ జాగ్రత్తగా నడిపితేనే ఎవరైనా గమ్యాన్ని చేరేది.. ఇక, కార్లు, బస్సులు, పెద్ద వాహనాలు నడిపేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ డ్రైవర్‌కు ఏకంగా 190 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.. బస్సు ప్రమాదంలో 22 మంది సజీవదహనానికి కారణమైన ఆ డ్రైవర్‌కు 10 ఏళ్ల చొప్పున 19 విడతలుగా జైల్లో గడపాలని తీర్పు వెలువరించింది మధ్యప్రదేశ్‌లోని ఓ కోర్టు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Read Also: హైదరాబాద్‌ను తాకిన ‘బుల్లి బై’ ఎఫెక్ట్.. సీఎం, డీజీపీకి ఒవైసీ విజ్ఞప్తి

2015 మే 4వ తేదీన 65 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు.. అదుపు తప్పి లోయలో పడింది.. డీజిల్‌ ట్యాంక్‌ బద్దలు కావడంతో మంటలు చెలరేగాయి.. భారీగా ప్రాణనష్టం జరిగింది.. ఆ ప్రమాదంలో 22 మంది సజీవదహనం కాగా, 12మంది ప్రయాణికులు తీవ్రగాయాలపాలయ్యారు.. అయితే, ఈ ప్రమాదానికి బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందని తేల్చిన కోర్టు.. ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు ఉండాల్సిన అత్యవసర ద్వారం మూసివేశారని.. అక్కడ అదనపు సీటు ఏర్పాటు చేయడంతో.. బాధితులు తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయినట్టు పేర్కొంది.. ఇక, నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు 10 ఏళ్ల చొప్పున 19 విడతలుగా జైలులో గడపాలని తీర్పు వెలువరించింది.. అంటే.. 19 విడతలుగా పదేల్ల చొప్పున అంటే.. 190 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Related Articles

Latest Articles