Chennai Super Kings Scored 68 Runs In First 10 Overs: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే! టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న సీఎస్కే బ్యాటింగ్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగుతోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 68 పరుగులే చేసింది. పవర్ ప్లేలో సీఎస్కే బాగానే రాణించింది. ఆరు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. అయితే.. పవర్ ప్లే ముగిసినప్పటి నుంచి సీఎస్కే దూకుడు నెమ్మదించింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి సీఎస్కే బ్యాటర్లు తడబడ్డారు. పవర్ ప్లేలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన సీఎస్కే.. ఆ తర్వాతి నాలుగు ఓవర్లలో రెండు వికెట్లను కోల్పోయింది.
Anuj Rawat : డైమండ్ డకౌట్ అయిన రవిచంద్రన్ ఆశ్విన్..

తొలుత సీఎస్కే తరఫున రుతురాజ్, కాన్వే ఓపెనింగ్ చేశారు. వీళ్లు తమ ఇన్నింగ్స్‌ని నిదానంగానే ప్రారంభించారు. ఇక వీళ్లిద్దరు క్రీజులో కుదురుకున్నారని అనుకునేలోపే.. రుతురాజ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అజింక్యా రహానే ఒక ఫోర్, మరో సిక్స్‌తో జోష్ నింపాడు కానీ, అతడూ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. 16 వ్యక్తిగత పరుగులు చేసిన అనంతరం క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అతడు లాంగ్ ఆఫ్‌లో గట్టిగానే షాట్ కొట్టాడు కానీ, అది నేరుగా బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. ఆ కొద్దిసేపటికే కాన్వే కూడా పెవిలియన్ బాట పట్టాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక 11వ ఓవర్లో తొలి బంతికే అంబటి రాయుడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
BJP: మరేం పర్వాలేదు.. కర్ణాటకలో ఓడినా బీజేపీ ఆనందమే.. కారణం ఇదే..