చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే తాజాగా ఓ ఇంటి వాడయ్యాడు. కాన్వే న్యూజిలాండ్ క్రికెటర్ అయినా అతడి సొంత దేశం దక్షిణాఫ్రికా. అక్కడే పుట్టి పెరిగాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్ మాత్రం న్యూజిలాండ్ తరఫున ఆడుతున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్‌గా కాన్వే రాణిస్తుండటంతో చెన్నై సూపర్‌కింగ్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో రూ.కోటికి కోనుగోలు చేసింది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అయితే ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన అతడు కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు.
అనంతరం కాన్వే తన పెళ్లివేడుక కారణంగా బయోబబుల్ వీడి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ మేరకు తన ప్రేయసి కిమ్ వాట్సన్‌ను పెళ్లాడాడు. ఈ నేపథ్యంలో తన విహహ వేడుకకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశాడు. దీంతో కాన్వే దంపతులకు క్రికెట్ ప్రముఖులు, సహచర క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా అంతకుముందు డెవాన్ కాన్వే బయోబబుల్‌ను వీడే సమయంలో చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ అతడి కోసం సంప్రదాయ ప్రీ-వెడ్డింగ్ వేడుకను ఏర్పాటు చేసింది. తాజాగా లయన్, లేడీ ఒక్కటయ్యారు. హ్యాపీ వెడ్డింగ్.. విజిల్స్ టు కిమ్ అండ్ కాన్వే అంటూ పోస్ట్ చేసింది.