Jasprit Bumrah: ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బుమ్రా.. తొలి భారత పేసర్ గా రికార్డ్!
- ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బుమ్రా
- తొలి భారత పేసర్ గా రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జస్ ప్రీత్ బుమ్రా.. బుల్లెట్ లాంటి బంతులతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి ప్లేయర్స్ కు ముచ్చెమటలు పట్టిస్తాడు. మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లను చతికిలపడేస్తాడు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటాడు. క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు జస్ ప్రీత్ బుమ్రా. ఇప్పుడు మరోసారి అరుదైన గౌరవాన్ని దక్కించుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 2024కి గానూ ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ విషయాన్ని ప్రకటించింది. క్రికెట్ లో అత్యుత్తమ ప్రతిభకనబర్చినందుకు గాను బుమ్రాను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కాగా బుమ్రా గతేడాది 13 టెస్టుల్లో 14.92 సగటుతో 71 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జో రూట్ (ఇంగ్లాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక), హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్)లను వెనక్కి నెట్టి బుమ్రా ఈ అవార్డును అందుకున్నాడు. ఈ మైలురాయిని సాధించిన తొలి భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ఆరో భారత ప్లేయర్‌గానూ బుమ్రా నిలిచాడు. ఇంతకుముందు ఆర్ అశ్విన్, విరాట్ కోహ్లీ సహా కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.
Also Read
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
Dominating the bowling charts in 2024, India’s spearhead Jasprit Bumrah has been crowned ICC Men’s Test Cricketer of the Year 💥#ICCAwards pic.twitter.com/h8Ppjo2hrv
— ICC (@ICC) January 27, 2025
తాజావార్తలు
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!