JP Nadda meet Mithali Raj: జేపీ నడ్డాతో మిథాలీరాజ్‌భేటీ.. విషయం ఇదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. అందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చాలా సార్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.. ఇవాళ హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.. విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న నడ్డాకు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్.. సహా మరికొందరు నేతలు స్వాగతం పలికారు.. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ సమీపంలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు నడ్డా.. అప్పటికే నోవాటెల్‌కు చేరుకున్న భారత క్రికెటర్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్.. జేపీ నడ్డాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వన్ టు వన్‌గా ఈ మీటింగ్ జరిగినట్టు తెలుస్తోంది.. నోవాటెల్‌కు వచ్చి వెళ్తున్న బీజేపీ నేతలను ఈ విషయంపై ప్రశ్నించగా.. జేపీ నడ్డా-మిథాల్ రాజ్ మధ్య ఎలాంటి చర్చ జరిగిందనే విషయం తమకు తెలియదు అన్నారు.. నడ్డాతో పాటు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కూడా.. మిథాలీ రాజ్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నట్టుగా చెబుతున్నారు.
Read Also: KTR: నా పేరుతో కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడు..? నా దృష్టిలే అమ్మే నా దేవత..!
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
అయితే, భారత మహిళా క్రికెట్లో మిథాలీరాజ్ కీలక భూమిక పోషించారు.. అన్ని ఫార్మాట్లలో రాణించారు.. అనేక విజయాల వెనుక ఆమె కృషి ఉంది.. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి మహిళా జట్లకు అవకాశం కల్పించారు.. అయితే, భారత జట్టు బంగారం పథకం సాధిస్తుందని అందరూ ఆశించినా.. ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు బోల్తా కొట్టింది.. సిల్వర్ పతకంతో సరిపెట్టుకుంది.. ఈ సిరీస్‌లోనూ మిథాలీరాజ్ భారత జట్టు తరుపన ఆడిన విషయం తెలిసిందే.. మహిళా జట్టుకు ఆమె అందిస్తున్న సపోర్ట్‌కు జేపీ నడ్డా అభినందనలు తెలియజేసినట్టుగా తెలుస్తుంది.. మొత్తంగా పొలిటికల్ సర్కిల్లో ఇది హాట్‌టాపిక్‌గా మారినా.. మితాలీరాజ్.. చేపట్టే రోల్‌ను బట్టి.. ఆ సమావేశంలో ఏం జరిగింది? అనేది తెలసే అవకాశం ఉంటుంది. ఇక, రాత్రికే జేపీ నడ్డాతో.. నటుడు నితిన్ సమావేశం కానున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?