Big Blow To Indian Cricket Team Before WTC Final Match: ఈమధ్య క్రికెటర్లు తరచూ గాయాలపాలవుతున్నారు. మైదానంలో ఆడుతూ దెబ్బలు తగలడమో, లేక ఇతర అనారోగ్య సమస్యల వల్లనో.. ఆసుపాత్రుల పాలవుతున్నారు. ఎక్కువగా.. ప్రాక్టీస్ సెషన్స్ లేదా మైదానంలో గాయాలపాలయ్యే దూరం అవుతున్నారు. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో.. టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఓ ఆటగాడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ.. గాయాలపాలయ్యాడు. ఇంతకీ అతనెవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు, విధ్వంసకర షాట్లు ఆడగల సత్తా ఉన్న వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.
Husband Killed Wife: భార్య గొంతు కోసిన భర్త.. కథలో ఊహించని ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే!
జూన్ 7వ తేదీ నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా, భారత జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ నెట్స్‌లో గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో భాగంగా.. నెట్ బౌలర్ అనికిత్ చౌదరీ వేసిన బంతి కిషన్ చేతికి బలంగా తాకింది. ఈ దెబ్బకు అతడు నొప్పితో విలవిల్లాడాడు. ఆ తర్వాతి నుంచి అతడు తిరిగి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అతనికి గట్టి దెబ్బే తగిలినట్టు తెలుస్తోంది. దీంతో.. అతడు జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం.. భారత జట్టుకి గట్టిదెబ్బ తగిలినట్లే!
GDP Growth: 2000 – 2020 మధ్య అత్యధిక జీడీపీ గ్రోత్ కలిగిన టాప్-10 దేశాలు
మరోవైపు.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, శ్రీకర్ భరత్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. కొంతమంది భరత్‌కు తుది జట్టులో చోటు ఇవ్వాలని సూచిస్తుంటే.. మరికొంతమంది కిషన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇద్దరు వికెట్ కీపింగ్‌లో ప్రతిభావంతులే అయినప్పటికీ.. బ్యాటింగ్ విషయంలో మాత్రం భరత్ కంటే ఇషాన్ కిషన్ మెరుగ్గా ఆడగలడని మాజీలు సూచిస్తున్నారు. రిషభ్ పంత్ తరహాలో అతడు విధ్వంసం సృష్టించగలడని చెప్తున్నారు. అయితే.. ఇప్పుడు గాయం కారణంగా జట్టు సెలక్షన్‌కు కిషన్ అందుబాటులో లేకపోతే, భరత్‌కు చోటు ఖాయమవుతుంది. మరి, ఇద్దరిలో ఎవరు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదిస్తారో చూడాలి.