BCCI to shift Rishabh Pant to Mumbai for treatment: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్ రిషభ్ పంత్.. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే! ఇప్పుడు బీసీసీఐ అతనికి మెరుగైన చికిత్స అందించడం కోసం.. ముంబైకి తరలిస్తోంది. అక్కడ రిషభ్ మోకాలికి, చీలమండకు చికిత్స అందించనున్నారు. ఈ విషయంపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్‌ను డయాగ్నసిస్, అతనికైన గాయాలకు మెరుగైన చికిత్స అందించడం కోసం ముంబైకి తరలిస్తున్నాం. అక్కడ చికిత్స అందించిన అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. ముంబైలో రిషభ్ బీసీసీఐ నియమించిన ప్రఖ్యాత స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో ఉంటాడు. ఒకవేళ సర్జరీ చేయాలని వైద్యులు చెప్తే, అతడ్ని యూఎస్ లేదా యూకేకి తీసుకెళ్తాం’’ అని చెప్పారు.
Delhi Car Horror: ఢిల్లీ యువతి అంజలి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు
కాగా.. ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి వెళ్తున్నప్పుడు ఎన్‌హెచ్-58 రహదారిపై అదుపు కోల్పోవడంతో, రిషభ్ కారు ఓ డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రిషభ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ యాక్సిడెంట్‌ని గమనించిన ఓ బస్ డ్రైవర్, కండక్టర్.. రిషభ్‌ని కాపాడారు. ఈ ఘటనలో రిషభ్ నుదుటిపై, కుడి మోకాలికి, చీలమండకు, మణికట్టుకి తీవ్ర గాయాలయ్యాయి. తొలుత పంత్‌ను సాక్షం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వాళ్లు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం మ్యాక్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో ఆలస్యం చేయకుండా అతడ్ని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందించినప్పటి నుంచి బీసీసీఐ పంత్ చికిత్సను పర్యవేక్షిస్తోంది. అతని వైద్యబృందంతో నిత్యం టచ్‌లోనే ఉంది. కాగా.. సెంట్రల్-కాంట్రాక్ట్ పొందిన క్రికెటర్లకు డయాగ్నసిస్ గానీ, ప్రోగ్నోసిస్ గానీ బీసీసీఐ తన వైద్యులతోనే చేయిస్తుంది.
Love Marriage Tragedy: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ రెండు రోజులకే..