Team India New Captain: టీమిండియా వన్డే కెప్టెన్గా ఎవరు ఊహించని పేరు..?
- దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో గాయపడిన శుభ్‌మన్ గిల్..
- సఫారీ జట్టుతో వన్డే సిరీస్ కు గిల్, బుమ్రా, శ్రేయస్, పాండ్యాకు విశ్రాంతి..
- టీమిండియా కొత్త సారథిగా ఎవరు ఊహించని పేరు ప్రకటించనున్న బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India New Captain: ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో మెడ గాయంతో వైదొలిగిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేదు.. అతడు టీంతో పాటు గౌహతికి వెళ్లినప్పటికి రెండో టెస్టుకు అందుబాటులో ఉండటంపై అనుమానాలు ఉన్నాయి. గిల్ గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అయితే, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అతడు దాదాపుగా రెండో టెస్టుకు దూరమైనట్లే తెలుస్తుంది. ఇక, గిల్ ప్లేస్ లో సాయి సుదర్శన్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం బోల్డ్ స్టేట్‌మెంట్
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
వన్డేలకు ఆ నలుగురు దూరం?
అయితే, గత కొంతకాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న శుభ్‌మన్ గిల్‌కు ప్రోటీస్ జట్టుతో వన్డేలకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అతడితో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియా టూర్ లో గాయపడ్డ శ్రేయస్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. కాబట్టి, అతడిని ఆడించి రిస్క్ తీసుకోవద్దని సెలెక్టర్లు యోచిస్తున్నారు. అయితే, వీరద్దరితో పాటు బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
టీమిండియా కొత్త కెప్టెన్ అతడే..?
ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో భారత జట్టు పగ్గాలను తిరిగి రోహిత్ శర్మకు అప్పగించాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అండ్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ రోహిత్ దానికి ఒప్పుకోకపోతే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌ను సారథిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, ఈ వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. వన్డే టీంలోకి యశస్వి జైశ్వాల్, సాయి సుదర్శన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాగా, నవంబర్ 30వ తేదీ నుంచి రాంచీ వేదికగా ఈ 3 వన్డేల సిరీస్ స్టార్ట్ కానుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!