ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయ్యాక 20 రోజుల పాటు రిలాక్స్ అయ్యే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. కోహ్లీ సేన జూన్ 23న బయో బబుల్‌ను వీడితే.. తిరిగి జులై 14న బబుల్‌లోకి ప్రవేశించనుంది. ఈ మూడు వారాల పాటు భారత బృందం.. యూకే పరిధిలో ఎక్కడ గడుపుతారన్నది వారి వ్యక్తిగత విషయమని బీసీసీఐ తేల్చింది. నాలుగున్నర నెలల పాటు సాగే సుదీర్ఘ పర్యటన కావడంతో ఆటగాళ్లకు ఈ బ్రేక్ ఊరట కలిగించే అంశమని, ఈ సమయాన్ని క్రికెటర్లు కుటుంబం సభ్యులతో కలిసి ఆస్వాధించేందుకు ఉపయోగపడుతుందని బీసీసీఐ పేర్కొంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టు సభ్యులంతా జులై 14న తిరిగి భారత క్యాంప్‌లోకి అడుగుపెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
టీమిండియాకు బీసీసీఐ గుడ్‌న్యూస్.. ఆ 20 రోజులు మీ ఇష్టం..!

team india