భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2025-26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్, అంతర్జాతీయ ప్రదర్శనలను ఆధారంగా చేసుకుని గ్రేడ్‌లను ఖరారు చేసినట్లు సమాచారం. ఈసారి గ్రేడ్‌లలో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్లు, యువ ఆటగాళ్లకు బీసీసీఐ సమానంగా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
గ్రేడ్ Aలో నలుగురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారని సమాచారం. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టాప్ గ్రేడ్‌లో ఉన్నారు. స్థిరమైన ప్రదర్శనలే గ్రేడ్ A కాంట్రాక్టుకు కారణం. గ్రేడ్ Bలో అనుభవజ్ఞులైన స్టార్ ప్లేయర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా వంటి సీనియర్లతో పాటు మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్ ఈ గ్రేడ్‌లోకి ఉన్నారు.
గ్రేడ్ Cలో ఎక్కువగా యువత ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ధృవ్ జురెల్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. రాబోయే రోజుల్లో భారత జట్టుకు వీరే ప్రధాన బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. గ్రేడ్ Dలో కొత్తగా అవకాశాలు అందుకున్న ప్లేయర్స్ ఉంటారు. రింకు సింగ్, శివమ్ దూబే, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, సర్ఫరాజ్ ఖాన్, సాయి సుదర్శన్, పడిక్కల్, రవి బిష్ణోయ్ ఈ గ్రేడ్‌లో చోటు దక్కించుకున్నారు. సీనియర్, యువ ఆటగాళ్లతో కలిపి భారత జట్టును మరింత బలంగా తీర్చిదిద్దాలన్నదే ఈ గ్రేడ్‌ల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా చెప్పవచ్చు.
Also Read: Varanasi Release Date: క్రేజీ అప్‌డేట్.. ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
గ్రేడ్‌ల జాబితా:
గ్రేడ్ A:
జస్ప్రీత్ బుమ్రా, శుభమాన్ గిల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్.
గ్రేడ్ B:
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ఆర్ జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్.
గ్రేడ్ C:
రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ధృవ్ జురెల్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్.
గ్రేడ్ D:
రింకూ సింగ్, శివమ్ దూబే, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ, సర్ఫరాజ్ ఖాన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్.
