India vs New Zealand: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే..
- న్యూజిలాండ్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా..
- నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లను ప్రకటించిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand: భారత్ వేదికగా అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియాలో కేవలం ఒక్క మార్పు చేసింది. యువ పేసర్ యశ్ దయాల్‌ను సెలక్టర్లు పక్కన పెట్టేశారు. అతడి స్థానంలో కొత్త ప్లేయర్ ని ఎంపిక చేసేందుకు సెలక్టర్లు ఆసక్తి చూపలేదు. న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లను తుది జట్టులోకి తీసుకుంది.
Read Also: India vs Bangladesh 3rd T20: నేడే బంగ్లాతో భారత్ చివరి మ్యాచ్.. ఉప్పల్లో క్లీన్స్వీప్ చేస్తారా..?
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
అలాగే, మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోని స్టార్ బౌలర్ మహమ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆశ్చర్యకరంగా నలుగురు ఫాస్ట్ బౌలర్లను ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లుగా బీసీసీఐ పేర్కొనింది. ఇటీవల బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యువ బౌలర్ మయాంక్ యాదవ్‌తో పాటు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలను ఈ లిస్ట్ లో చేర్చింది. బ్యాట్స్‌మెన్ల ఎంపిక విషయానికి వస్తే శ్రేయాస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్‌లను సెలక్టర్లు పట్టించుకోలేదు.
Read Also: Suriya: వామ్మో సూర్య ఇదేం స్పీడు.. మరీ డిసెంబర్ నుంచేనా ?
ఇక, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సెలక్టర్లు కొత్త వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. 2022లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఒక టెస్టులో బుమ్రా సారథిగా వ్యవహరించాడు. అందుకే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది. నిజానికి ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లకు వైఎస్ కెప్టెన్ లేరు. నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జగరనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆరంభ టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్‌గా బుమ్రాను ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది.
Read Also: Off The Record : ఆదోని వైసీపీలో అయోమయం..కేడర్ జారిపోతున్నా పట్టించుకోని సాయిప్రసాద్ రెడ్డి
న్యూజిలాండ్ సిరీస్‌కు టీమిండియా తుది జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.. ఇక, ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!