Site icon NTV Telugu

Champions Trophy 2025: బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే.. ప్లేయర్స్ సేఫ్టీ చాలా ముఖ్యం

Yusuf Patan

Yusuf Patan

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. హైబ్రిడ్‌ మోడల్‌కు పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు దాదాపు అంగీకరించినట్లే. ఇక, పాక్‌కు టీమిండియాను పంపించేది లేదని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది. భద్రతా కారణాలరీత్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. దీనిపై భారత మాజీ క్రికెటర్లు స్వాగతిస్తుండగా.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్ మాత్రం రాజకీయాలను, క్రికెట్‌ను వేరుగా చూడాలని అంటున్నారు.

Read Also: Konda Surekha: మరో వివాదంలో కొండా సురేఖ.. రాజన్న కోడెల వివాదంలో మంత్రి పేరు..

కానీ, ప్లేయర్స్ సేఫ్టీ చాలా ముఖ్యమని టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ తెలిపారు. బీసీసీఐ ఎప్పుడూ ఆటగాళ్ల యొక్క రక్షణ గురించే ఆలోచిస్తుందని చెప్పుకొచ్చారు. బీసీసీఐ ఏం చేసినా ప్లేయర్ల సేఫ్టీ, దేశం మంచి కోసమే చేస్తుంది.. డబ్బు కోసం కాదని పేర్కొన్నారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 విషయంలో బీసీసీఐ నిర్ణయం సరైనదన్నారు. ఇక, ఈ బీసీసీఐ నిర్ణయాన్ని దేశంలోని ప్రతి ఒక్కరం స్వాగతించాలని యూసఫ్ పఠాన్ వెల్లడించారు.

Read Also: Pushpa 2 : పుష్ప 2 సినిమా చూడాలన్న ఆతృతలో ట్రైన్ చూసుకోకపోవడంతో తీవ్ర విషాదం

అయితే, ఇప్పటికే 3 సార్లు ఐసీసీ సమావేశం వాయిదా పడింది. బ్రీఫ్‌ సెషన్స్‌లో పాకిస్థాన్‌ బోర్డు ఎదుట ఐసీసీ ఆప్షన్లు పెట్టింది. హైబ్రిడ్ మోడల్‌కు పాక్‌ కూడా అంగీకరించినప్పటికి.. ఓ మెలిక పెట్టారనే కథనాలు వెలువడ్డాయి. మిగతా టోర్నీల్లో తాము ఆడే మ్యాచులకూ సైతం హైబ్రిడ్‌ మోడల్‌లోనే నిర్వహించాలని కోరినట్లు తెలుస్తుంది. దానికి బీసీసీఐతో పాటు ఐసీసీ కూడా ఒప్పకున్నట్లు క్రికెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇవాళ (డిసెంబర్ 7) సాయంత్రం జరగబోయే భేటీలో జై షా నేతృత్వంలోని ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Exit mobile version