T20 World Cup: మహ్మద్ యూనస్ చేసిన రాజకీయంతో బంగ్లాదేశ్ క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్(BCB) నిరాకరించింది. భద్రతా కారణాలను చూపుతూ, తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరింది. అయితే, ICC మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో బీసీసీ టోర్నీని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది.
ఇదిలా ఉంటే, సొంత క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ ఆటగాళ్లను వెన్నుపోటు పొడించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను తొలగించిన కొద్ది గంటల్లోనే బంగ్లా ప్లేయర్లకు తీవ్ర అవమానం జరిగింది. ఆటగాళ్ల ఆగ్రహానికి కారణమైన ఎం నజ్ముల్ ఇస్లాంను మళ్లీ బోర్డు ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా నియమించడంతో తీవ్ర దుమారం చెలరేగింది. నజ్ముల్‌కు పదవి కట్టబెట్టడం తమ గౌరవాన్ని హరించడమే అని, ఇది బంగ్లా ప్లేయర్లకు జరిగిన బహిరంగ ద్రోహంగా అభిమానులు, మాజీ క్రికెటర్లు అభివర్ణిస్తున్నారు.
Read Also: H-1B Visa Delay: అమెరికా కల చెదిరింది.. 2027 వరకు హెచ్-1బి వీసా కోసం ఆగాల్సిందే!
మొత్తం వివాదానికి బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ వివాదమే కారణం. బీసీబీ డైరెక్టర్ ఎం. నజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలపై బంగ్లా ప్లేయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో టీ20 వరల్డ్ కంప్ నిర్వహణ అంశంపై బీసీసీఐతో చర్చలు జరపాలని మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలపై, నజ్ముల్ మాట్లాడుతూ.. ఇక్బాల్ ‘‘భారత్ ఏజెంట్’’ అంటూ దూషించాడు. ఇదే కాకుండా బంగ్లా వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే, ఆటగాళ్లకు పరిహారం అవసరం లేదని, ఆటగాళ్లు విఫలమైతే వారికి ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవాలన అనడంతో ప్లేయర్లు మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలతో బంగ్లా ప్లేయర్లు తిరుగుబాటు చేశారు. నజ్ముల్ హుస్సేన్ షాంటో, మెహదీ హసన్ మిరాజ్ వంటి ప్లేయర్లు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)ను బహిష్కరించారు. దీంతో ఒత్తిడికి లోనైన బంగ్లా బోర్డు నజ్ముల్‌ను ఆ పోస్ట్ నుంచి తొలగించి, షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే, నజ్ముల్ ఇస్లాం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉందని మళ్లీ ఫైనాన్స్ కమిటీ చీఫ్‌గా నియమించడంతో ఆటగాళ్లు తమను అవమానపరిచారని భావిస్తున్నారు. నిజానికి భారత్ లో ఆడేందుకు బంగ్లా ప్లేయర్లు సిద్ధంగా ఉన్న కూడా, బంగ్లా బోర్డు, ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో వివాదాన్ని తీసుకువచ్చింది. చివరకు టోర్నీ నుంచి బహిష్కరణకు గురైంది.
