Bangladesh Cricketers: బంగ్లాదేశ్ క్రికెటర్ల పరిస్థితి తీవ్రంగా ఆందోళనకరంగా మారింది. బంగ్లా తాతాల్కి క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌తో సమావేశం అనంతరం జట్టు హోటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు వారి ముఖాల్లో నిస్సహాయత, నిరాశ స్పష్టంగా కనిపించాయి. తమ భవిష్యత్తును ప్రభుత్వం, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఇప్పటికే నిర్ణయించేశాయని వారికి అర్థమైపోయినట్లుగా తెలుస్తుంది. తాత్కాలిక ప్రభుత్వం, బీసీబీ చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరుగుతుందనే ఆశ వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఐసీసీ మాత్రం బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసే ప్రకటనను ఈరోజు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.
Read Also: Champion : ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న రోషన్ ‘ఛాంపియన్’..
అయితే, ఆసిఫ్ నజ్రుల్‌తో జరిగిన సమావేశంలో తమ అభిప్రాయాలకు గౌరవం ఇస్తారని బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆశించారు. కానీ, ఈ భేటీ పూర్తిగా భిన్నంగా కొనసాగిందని సమాచారం. ఆటగాళ్ల సమ్మతి తీసుకోవడం కోసం కాకుండా, ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని వారికి తెలియజేయడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భద్రతా కారణాలు చూపుతూ శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరింది. అయితే, సమావేశంలో ఆటగాళ్లకు కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ, వారి అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని తెలుస్తుంది. ఓ సీనియర్ క్రికెటర్ ఆవేదనతో “మనం ఈ వరల్డ్ కప్ ఆడకపోతే నష్టమంతా మన క్రికెట్‌కే.. ఇది మా భవిష్యత్తుకు పెద్ద దెబ్బ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
Read Also: Road Safety Shields: మీరు మీ ఫ్యామిలీ సేఫ్.. రోడ్లపై మరణాలకు చెక్ పెట్టే 5 సేఫ్టీ షీల్డ్స్!
ఇక, మరో ఆటగాడు మాట్లాడుతూ.. తాత్కాలిక ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకుంది.. మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే పరిస్థితి అక్కడే లేదని ఆరోపించారు. ఇంకొక క్రికెటర్ మాట్లాడుతూ, ఈ సమావేశం తమ సమ్మతి కోసం కాదని, ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని మాకు తెలియజేయడానికే పిలిచారని స్పష్టం చేశాడు. మాతో చర్చించకుండా ముందే ప్లాన్ సిద్ధం చేసుకుని వచ్చారు.. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆదేశమే.. ఇందులో బీసీబీ చేయగలిగింది ఏమీ లేదు అని వెల్లడించారు. కాగా, చాలామంది బంగ్లాదేశ్ క్రికెటర్లు భారత్‌లోనే టీ20 వరల్డ్ కప్ ఆడాలని కోరుకున్నారని సమాచారం. కానీ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయానికి బీసీబీ కూడా మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం బంగ్లాదేశ్ క్రికెట్‌కు దీర్ఘకాలంలో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.