Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరో మైలురాయిని అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో హాఫ్ సెంచరీతో రాణించిన బాబర్ ఆజమ్ ఒకేసారి టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులను సమం చేశాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 28వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టీ20ల్లో వేగంగా 28 హాఫ్ సెంచరీల ఘనత సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ 84వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సాధించడం గమనార్హం.
Read Also: Sree Leela: బంపరాఫర్ పట్టేసింది.. ఏకంగా పాన్ ఇండియా సినిమా
ఇదే మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ మరో రికార్డు కూడా సాధించాడు. రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. టీ20ల్లో చేధనలో 12 హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మతో కలిసి సమంగా రికార్డు నెలకొల్పాడు. చేధనలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (19) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. కాగా న్యూజిలాండ్‌తో రెండో టీ20లో 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. బాబర్ ఆజమ్ 53 బంతుల్లో 79 పరుగులు చేశాడు.
