Site icon NTV Telugu

Asia Cup 2025: నేటి నుంచే ఆసియాకప్‌ టోర్నీ.. తొలి మ్యాచ్‌లో

Asia

Asia

Asia Cup 2025: అభిమానులకు మళ్లీ క్రికెట్ పండగ మొదలైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు ముందు జరిగే అతి పెద్ద ఈవెంట్‌ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పొట్టి ఫార్మాట్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆసియాఖండంలోని ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగుతోంది. కాగా, ఆసియా కప్‌ టోర్నమెంట్ ఇవాళ (సెప్టెంబర్ 9న) ప్రారంభం కాబోతుంది. అబుదాబిలో జరిగే తొలి మ్యాచ్ లో అఫ్గానిస్థాన్, హాంకాంగ్‌ తలపడబోతున్నాయి.

Read Also: NaniOdela2 : నాని ‘ప్యారడైజ్’ కోసం 30 ఎకరాలలో భారీ ప్లానింగ్

అయితే, తొలి మ్యాచ్ అఫ్గాన్ – హాంకాంగ్ మధ్య ఈ రోజు రాత్రి 8 గంటలకు జరగనుంది. అబుదాబి వేదికగా జరిగే ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక, టీమిండియా తన తొలి మ్యాచ్‌ను యూఏఈతో రేపు (సెప్టెంబర్ 10న) ఆడనుంది. భారత్ – పాక్ మధ్య సెప్టెంబర్ 14వ తేదీన హై ఓల్టేజ్ మ్యాచ్ కొనసాగనుంది. గ్రూప్ స్టేజ్, సూపర్ 4, ఫైనల్ ఇలా టోర్నీని ఏసీసీ డిజైన్ చేసింది.

Read Also: Viral: రోజూ పెద్దగా గురక వస్తుందా.. అయితే ఈ విషయాలు గుర్తించుకోండి…

కాగా, ఈ ఆసియా కప్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి.. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్‌, యూఏఈ, ఒమన్.. గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. ఇక, భారత్ – పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ కోసం యావత్ క్రికెట్ లవర్స్ వేచి చూస్తున్నారు. ఈ టోర్నీ సెప్టెంబర్ 28వ తేదీన దుబాయ్‌లో ఫైనల్స్‌తో ముగియనుంది.

Exit mobile version