Site icon NTV Telugu

India Vs Pakistan: బూమ్రా “రాఫెల్” సెలబ్రేషన్స్.. హారిస్ రౌఫ్ ఔట్ వీడియో వైరల్..

Bumrah

Bumrah

India Vs Pakistan: ఆసియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ జట్టు సైకిల్ స్టాండ్‌ని తలపించింది. 19.1 ఓవర్లలో కేవలం 146 రన్స్‌కి ఆలౌట్ అయింది. ఓపెనర్లు సరైన ఆరంభం ఇచ్చినప్పటికీ మిగతా బ్యాటర్లు క్రీజ్‌లో నిలవలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో పాక్ జట్టు నడ్డి విరిచాడు. వరుణ్ చక్రవర్తి (2), అక్షర్ పటేల్ (2), జస్ప్రీత్ బుమ్రా (2) ఇతర వికెట్లు పడగొట్టారు.

Read Also: Bhagyashree : టైట్ డ్రెస్ లో భాగ్య శ్రీ అందాల బీభత్సం

అన్నింటి కన్నా ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బూమ్రా తీసిన వికెట్ హైలెట్‌గా మారింది. సూపర్ ఫోర్ రౌండ్‌లో ఎక్స్‌ట్రాలు చేసిన హారిస్ రౌఫ్ వికెట్ తీశారు. బూమ్రా ధాటికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వికెట్ తీసిన తర్వాత, బూమ్రా చేసిన హావభావాలు వైరల్‌గా మారాయి. ‘‘ మీ విమానాలను ఇళా కూల్చేశాం రా’’ అని బూమ్రా చెప్పకనే చెప్పాడు. దీంతో ఇండియన్ ఫ్యాన్.. హారిస్ రౌఫ్‌కి బూమ్రా తిరిగి ఇచ్చేశాడు రా అని తెగ సంబర పడిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రౌఫ్‌ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. రాఫెల్ విమానాలు రౌఫ్ ప్రైవేట్ పార్టులోకి దూరాయి అని కామెంట్స్ పెడుతున్నారు. దీనికి ముందు ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ భారత 6 విమానాలను కూల్చేసిందనే అర్థం వచ్చేలా రౌఫ్ ఎగతాళి చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version