Ashes Test 2023: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణి.. పలు రికార్డులు బద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia Creates Several Records after Beat England in Ashes 2023 1st Test: ప్రతిష్టాత్మక యాషెస్ 2023 తొలి టెస్టులో ఓటమి ఖాయం అనుకున్నా.. గొప్పగా పోరాడిన ఆస్ట్రేలియా అద్భుత విషయం సాధించింది. ‘బజ్‌బాల్’ అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్ ప్లాన్ బెడిసికొట్టింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేసిన ఉస్మాన్ ఖవాజా (65; 197 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ చేశాడు. చివరి రోజు మ్యాచ్ చేజారుతున్న దశలో కెప్టెన్ పాట్ కమిన్స్ (44 నాటౌట్; 73 బంతుల్లో 4×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 5 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆసీస్ ముందంజ వేసింది. ఇక తర్వాతి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 28న మొదలవుతుంది. ఈ మ్యాచులో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆసీస్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
# ఇంగ్లండ్ గడ్డపై విదేశీ జట్లు అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఇది ఐదవసారి. 1948లో హెడ్డింగేలో ఆస్ట్రేలియా 404 పరుగుల టార్గెట్‌ను ఛేదించగా.. 1984లో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్ 342 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. 2017లో హెడ్డింగేలో వెస్టిండీస్ 322 పరుగుల టార్గెట్‌ను సాధించగా.. 2008లో ఎడ్జ్‌బాస్టన్‌లో దక్షిణాఫ్రికా 281 పరుగుల టార్గెట్‌ను పూర్తిచేసింది.
Also Read
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Mohammed Siraj: ఇక వరంగల్‌కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
- Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
# యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించడం ఆస్ట్రేలియా జట్టుకు ఇది ఐదోసారి. 1948లో హెడ్డింగేలో 404 పరుగుల టార్గెట్, 1902లో అడిలైడ్‌లో 315 పరుగుల టార్గెట్, 1929లో మెల్‌బోర్న్‌లో 286 పరుగుల టార్గెట్, 2023లో ఎడ్జ్‌బాస్టన్‌లో 281 పరుగుల టార్గెట్, 1897-98లో సిడ్నీలో 275 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ చేధించింది.
# ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో 275 అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని చేధించడం ఇది 15వ సారి. ఈ ఏడాదే ఐదుసార్లు ఛేదించింది.
Also Read: Honey Health Benefits: తేనెను ఇలా తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
# టెస్టుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్లలో బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 80 పరుగులు, బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆరో ఆటగాడు పాట్ కమిన్స్. ఇదివరకు బాబ్ సింప్సన్ నాలుగు సార్లు, జార్జ్ గిఫెన్ రెండు సార్లు.. వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్, రిచీ బెర్నాడ్, అలెన్ బోర్డర్ తలా ఒకసారి ఈ ఘనత అందుకున్నారు.
# ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ఆస్ట్రేలియా కెప్టెన్లలో పాట్ కమిన్స్ రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో కమిన్స్ ఐదు సిక్సర్లు బాదాడు. 2005లో రికీ పాంటింగ్ న్యూజిలాండ్‌పై ఐదు సిక్సర్లు బాది తొలి స్థానంలో ఉన్నాడు. 1972లో ఇయాన్ చాపెల్ పాకిస్తాన్‌పై నాలుగు సిక్సర్లు బాది మూడో స్థానంలో ఉన్నాడు.
Also Read: Maruti Upcoming Car Launch: 35కిమీ మైలేజీతో రెండు చౌకైన కార్లను విడుదల చేస్తున్న మారుతి!
తాజావార్తలు
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!