NTV Telugu Site icon

Ashes 2023: రసవత్తరంగా యాషెస్‌ తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాకు 174 రన్స్, ఇంగ్లండ్‌కు 7 వికెట్లు!

England Test Team

England Test Team

Australia need 174 more to win Ashes 2023 1st Test: ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ 2023లోని తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. తొలి టెస్ట్ గెలవడానికి అటు ఆస్ట్రేలియాకు, ఇటు ఇంగ్లండ్‌కు సమ అవకాశాలు ఉన్నాయి. చివరి రోజు ఆసీస్ గెలవడానికి 174 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లీష్ జట్టుకు ఇంకా 7 వికెట్స్ కావాలి. దాంతో ఇరు జట్లు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. చివరి రోజు ఎవరు ఆధిపత్యం చెలాయిస్తే వారికే తొలి టెస్ట్ సొంతమవుతుంది. అయితే ముగ్గురు స్టార్ బ్యాటర్లు పెవిలియన్ చేరినా.. క్రీజులో ఉస్మాన్‌ ఖవాజ ఉండడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం.

ఇంగ్లండ్‌ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు మంచి శుభారంభమే దక్కింది. ఫామ్‌ లేమితో సతమతమవుతున్న సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (36) ఫర్వాలేదనపించాడు. అయితే వార్నర్‌ను ఓలి రాబిన్సన్‌ ఔట్‌ చేయడంతో 61 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్‌ (13) నిరాశపరిచాడు. స్టువర్ట్ బ్రాడ్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

Also Read: Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు! తులం గోల్డ్ ఎంతంటే

కష్టాల్లో పడిన జట్టును ఆదుకుంటాడనుకున్న మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ (6) త్వరగానే ఔట్ అయ్యాడు. స్టువర్ట్ బ్రాడ్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి మూడో వికెట్‌గా నిష్క్రమించాడు. సెంచరీ హీరో ఉస్మాన్‌ ఖవాజ (34 నాటౌట్‌) క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా
స్కాట్ బోలాండ్ (13) ఉన్నాడు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఆసీస్‌ విజయానికి 174 పరుగుల దూరంలో ఉంది. ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ బ్యాటింగ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో విజయావకాశాలు ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లీష్ బౌలర్లు మాయ చేస్తే గాని ఆసీస్ ఓడిపోక తప్పదు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 393/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆపై ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో గట్టి పోటీ ఇచ్చింది. ఉస్మాన్ ఖవాజా (141) సెంచరీ చేయడంతో 386 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 273 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఆసీస్ 281 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది. ఐదవ రోజు ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: PM Modi US Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..