Arjun Tendulkar: ఆమెతో సచిన్ తనయుడు.. వైరలవుతున్న ఫోటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలెబ్రిటీ స్టేటస్ ఉన్నవారు ఎవరితోనైనా కాస్త సన్నిహితంగా మెలిగినా, కనీసం కలిసి ఫోటో దిగినా.. ఆ ఇద్దరి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే రూమర్లు పుట్టుకొచ్చేస్తాయి. ఇప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌పై అలాంటి రూమర్లే తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో అతను సన్నిహితంగా ఉన్న ఫొటో ఒకటి నెట్టింట్లో దర్శనమిచ్చింది. అందులో అర్జున్, వ్యాట్ కాస్త చనువుగా ఉండటాన్ని గమనించవచ్చు. అంతే, అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మనోడు ఇంగ్లీష్ పిల్ల బుట్టలో పడ్డాడంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. వాస్తవానికి వ్యాట్ ఎప్పట్నుంచో సచిన్ ఫ్యామిలీతో సన్నిహితంగానే ఉంటూ వస్తోంది. సచిన్‌కు వీరాభిమాని అయిన ఆమె.. 2009 నుంచే తనకు సచిన్, అర్జున్‌లో పరిచయం ఉందని గతంలో పలు సందర్భాల్లో వెల్లడించింది కూడా! లార్డ్స్ మైదానికి సచిన్ పిల్లలు ఎప్పుడూ వచ్చినా, వారిని ఆమె తప్పకుండా కలిసేది. అంటే, ఆమెకు సచిన్ కుటుంబంతో మంచి స్నేహబంధం ఉందన్నమాట! ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఆమె సచిన్ పిల్లల్ని కలవడం సాధారణం. ఇప్పుడు కూడా అలాగే క్యాజువల్‌గా అర్జున్, వ్యాట్ కలిసి ఉంటారని.. ఈ సందర్భంగా వాళ్లు కలిసి ఫోటో తీసుకొని ఉండొచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. అర్జున్, వ్యాట్ల ఫోటో మాత్రం తాజాగా నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
- CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
- Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
ఇదిలావుండగా.. 31 ఏళ్ల వ్యాట్ ఇంగ్లండ్ తరఫున 93 వన్డేలు, 124 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఆ రెండు ఫార్మాట్స్‌లో కలిపి ఆమె తన కెరీర్ మొత్తంలో 4 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 3400కు పైగా పరుగులు చేసింది. హాఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన వ్యాట్.. రెండు ఫార్మాట్లలో కలిపి 73 వికెట్లు పడగొట్టింది.

తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?