ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కామల్‌వెల్త్ గేమ్స్‌కి సిద్ధమవుతున్న భారత్‌కు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. డోప్ టెస్ట్‌లో అథ్లెట్లు ఒకరి తర్వాత మరొకరు పట్టుబడుతున్నారు. ఇప్పటికే నలుగురు అథ్లెట్లు డోప్ టెస్ట్‌లో విఫలమై.. ఈ మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించారు. ఇప్పుడు తాజాగా మరో అథ్లెట్ ఈ టెస్ట్‌గా బుక్ అయ్యింది.
మహిళల 4×100 మీటర్ల బృందంలోని ఓ సభ్యురాలికి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) డోప్ట్ టెస్ట్ నిర్వహించగా.. రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. ఈ విషయాన్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ధృవీకరించారు. అయితే.. ఆ అథ్లెట్ పేరు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. కాగా.. అంతకుముందే ఇదే విభాగంలో (4×100 మీటర్ల బృందం) ఓ మహిళ డోప్ టెస్ట్‌లో విఫలమైంది. ఆమె పేరు ధనలక్ష్మీ.
విదేశాల్లో అథ్లెటిక్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ)లో నిర్వహించిన డోపింగ్ టెస్టులో పాజిటివ్ అని తేలింది.
ఇక గత నెలలో చెన్నైలో జరిగిన ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్స్‌లో భాగంగా ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు డోపింగ్‌కు పాల్పడిందని తేలింది. ఈమెతో పాటు అనీష్ కుమార్, సురేంద్రన్ పిళ్లై అనే పారా అథ్లెట్లతో సైతం డోప్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారు. వీళ్లందరు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. తాజా ఘటనతో భారత బృందంలో డోపీల సంఖ్య ఐదుకి చేరింది.