Afghanistan: కెప్టెన్సీకి రాజీనామా చేసిన నబీ.. సెలక్టర్లు జట్టు ఎంపిక చేసేది ఇలాగేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan: టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్-12 దశలో ఆప్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే చివరి మ్యాచ్‌లో మాత్రం ఆస్ట్రేలియాపై గెలిచినంత పనిచేసింది. చివరకు 4 పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. మెగా టోర్నీలో ఒక్క విజయం కూడా లేకుండా తమ జట్టు నిష్క్రమించడంతో ఆప్ఘనిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ నబీ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. జట్టు ఎంపికలో టీమ్ మేనేజ్మెంట్ సరిగ్గా వ్యవహరించలేదని.. దీంతో జట్టు కూర్పు దెబ్బతిన్నదని నబీ తెలిపాడు.
Read Also: ఆ సినిమాల కోసం బరువు పెరిగిన హీరోయిన్లు వీరే..
Also Read
- IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!
- Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
- Guinness World Record: ముక్కు నేలకు తాకేలా హ్యాండ్‌స్టాండ్ పుష్అప్స్.. మహిళ గిన్నిస్ రికార్డు..
- India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్‌కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
టీ20 ప్రపంచకప్‌లో తమ ఆటగాళ్లు, అభిమానులు ఆశించని విధంగా తమ ప్రయాణం ముగిసిందని నబీ అన్నాడు. ఈ టోర్నీకి తమ ప్రిపరేషన్స్ ఒక కెప్టెన్‌కు సంతృప్తినిచ్చే స్థాయిలో లేవని పేర్కొన్నాడు. చాలా విషయాల్లో జట్టు మేనేజ్మెంట్, సెలక్టర్లు, తాను ఏకాభిప్రాయానికి రాలేకపోయామని.. ఇది జట్టుపై ప్రభావం చూపిందన్నాడు. అందుకే కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు నబీ స్పష్టం చేశాడు. సెలెక్టర్లు తనను జట్టులోకి ఎంపిక చేస్తే ఆటగాడిగా దేశానికి సేవలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపాడు. కాగా ఆప్ఘనిస్తాన్ సూపర్-12 దశలో ఆరు మ్యాచ్‌లలో నాలుగు పరాజయాలను చవిచూసింది. రెండు మ్యాచ్‌లు మాత్రం వర్షం కారణంగా రద్దయ్యాయి.
తాజావార్తలు
-
Vayu Tej: మెగా వారసుడి ఫస్ట్ లుక్.. వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి షేర్ చేసిన నాగబాబు!
-
IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!
-
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!