NTV Telugu Site icon

World Bicycle Day: నేడు ప్రపంచ సైకిల్‌ దినోత్సవం..

World Bicycle Day 2024

World Bicycle Day 2024

World Bicycle Day: ఇటీవలి కాలంలో బైక్‌లు ఎక్కువై సైకిళ్ల వైపు ఎవరూ చూడడం లేదు. సైకిల్ అంటే పిల్లలు నడపాలని భావిస్తారు.ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన సైకిల్ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ రోజు సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సైక్లింగ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సైక్లింగ్ మీరు బరువు తగ్గడానికి, కండరాలను నిర్మించడానికి మరియు కొవ్వును కాల్చడానికి సహాయపడుతుంది. సైకిల్ తొక్కడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. వేగంగా వెళ్లకుండా గంటసేపు సైకిల్ తొక్కితే 300 కేలరీలు ఖర్చవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Read More: Telangana Rains: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు వర్షాలు..

కాళ్లకు బలం చేకూరుస్తుంది. సైకిల్ తొక్కడం వెనుక వీపును బలపరుస్తుంది. కాళ్లు బలపడతాయి. కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా కాలి కండరాలకు బలాన్ని అందిస్తుంది. కాళ్లు ఎంత బలంగా ఉంటే సైకిల్ తొక్కే సామర్థ్యం అంత మెరుగ్గా ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే హార్మోన్లు ఎండార్ఫిన్‌లను ఉత్పత్తి చేయడంలో సైక్లింగ్ ఉపయోగపడుతుంది. ఎండార్ఫిన్లు మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. సైకిల్ తొక్కేటప్పుడు మీ మనస్సు ఎల్లప్పుడూ మీ గమ్యస్థానంపైనే ఉంటుంది. కాబట్టి మీ దృష్టి పెరుగుతుంది. సైక్లింగ్ శరీర సమతుల్యతను పెంచడంలో, శరీరంతో సరైన సమన్వయానికి సహాయపడుతుంది. కాగా.. ఒకప్పుడు సైకిల్ ఉంటే సౌకారే అని చెప్పేవారు. అంతేకాదు కట్నంగా సైకిల్ ఇచ్చేవారట. కానీ ఇప్పుడు ఆ సైకిల్ ఆరోగ్యం కోసం వాడటం అలావటైంది.

Read More: WI vs PNG: పసికూనపై చెమటోడ్చి గెలిచిన వెస్టిండీస్!

జర్మనీకి చెందిన కార్ల్ వాన్ డ్రైస్ సైకిల్‌ను అభివృద్ధి చేశాడు. అయితే దాని పేరు సైకిల్ కాదు. 1817లో ‘స్విఫ్ట్ వాకర్’ పేరుతో రోడ్డుపై సైకిల్‌ను ప్రవేశపెట్టారు. దీనికి పెడల్స్ లేవు. ఇనుప చట్రం కాకుండా, చెక్కతో తయారు చేయబడింది. ఇనుప రిమ్‌లకు లెదర్ టైర్లను అమర్చారు. ఆ తరువాత, సైకిల్ వివిధ మార్పులతో దాని ప్రస్తుత రూపాన్ని పొందింది. బ్రిటిష్ వారు మన దేశానికి సైకిల్ తెచ్చారు. వలసవాదుల వల్ల మనకు తెలిసిన వాహనం.. సైకిల్..! ఇది ఒకప్పుడు స్టేటస్ సింబల్..! ఒక్కో గ్రామానికి ఒకటి రెండు సైకిళ్లకు మించి ఉండేవి కావు.
TG Polycet Results: నేడు పాలిసెట్ ఫ‌లితాల విడుద‌ల‌..

Show comments