TG Polycet Results: నేడు పాలిసెట్ ఫలితాల విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Polycet Results: పాలీసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఐఏఎస్, తెలంగాణ ఎస్‌బీటీఈటీ ఛైర్మన్ శ్రీ బి. వెంకటేషం, ఎస్‌బీటీఈటీ ఎస్.వీ భవన్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్‌లో పాలిసెట్ 2024 ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం https://sbtet.tela ngana.gov.in ని సంప్రదించవచ్చు. కాగా.. మే 24న పాలిసెట్ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 49 పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడ పట్టణాల్లో సైతం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Read more: Road Accident: పెళ్లిబృందం ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి!
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
మొత్తం 31,725 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 27495 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 4232 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మూడు విడతలుగా జరగ్గా.. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన పరీక్షలో 85% మంది , రెండో విడత 12:30 నుండి 2:30 వరకు జరగగా 86%, మూడవ విడత నాలుగు గంటల నుండి 6 గంటల వరకు 88% మంది హాజరయ్యారు. ప్రశ్నాపత్రాల కోడ్ విడుదల అనంతరం పరిశీలనకు వెళ్లిన ఆచార్య లింబాద్రి.. ఆన్లైన్ పరీక్ష విధానాన్ని వివరించారు.
Read more: Astrology: జూన్ 03, సోమవారం దినఫలాలు
తెలంగాణ పాలిసెట్ – 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 20 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించగా.. జూన్ 22 నుంచి మొదటి దశ వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. జూన్ 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో దశ కౌన్సెలింగ్ జూలై 7 నుంచి ప్రారంభం కానుంది. జూలై 13న సీట్లు కేటాయిస్తారు. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన గైడ్ లైన్లను జూలై 23న విడుదల చేస్తారు. జూలై 24లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
ladies Missing In Beach: బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు..
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!