Interesting Railway Facts: రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Interesting Railway Facts: సుదూర ప్రయాణాలకు చాలా మంది కళ్లు మూసుకొని ఎంచుకునే ప్రయాణ సాధనం ఇండియన్ రైల్వే. అలా కొండల చాటున ఉదయిస్తున్న సూర్యుడి రైలులో విండో సీట్‌లో కూర్చొని చూస్తూ, చాయ్ తాగుతూ చూస్తూ ఉంటే మామూలుగా ఉండదు. ఇప్పటి వరకు ఎప్పుడో ఒకసారి ప్రతిఒక్కరూ కచ్చితంగా రైలు ప్రయాణం చేసే ఉంటారు. మరీ మీలో ఎంత మందికి ఒక కామన్ డౌట్ వచ్చింది.. ఇంతకీ ఆ డౌట్ ఎంతో తెలుసా.. రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు వేస్తారు. దానికి సమాధానాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PM Kisan Yojana: ఈ రైతులు పీఎం కిసాన్ యోజన కింద రూ. 2000 కోల్పోవచ్చు..! 22వ విడత అప్‌డేట్ ఇదే
Also Read
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
వాస్తవానికి ఒకప్పుడు రైలు బొగ్గుతో నడిచేవి, కాలక్రమేణ కరెంట్ సాయంతో నడిచే రైళ్లు వచ్చాయి. దీంతో నేడు రైళ్లలో అనేక మార్పులను మనం గమనించవచ్చు. ఈ రోజుల్లో ఉన్న రైళ్లలో ఎన్నో సౌకర్యాలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ .. ఎక్స్‌ప్రెస్, వందే భారత్, బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎన్ని సాంకేతికతలు వచ్చినా.. రైలు ప్రయాణంలో ఒకటి మాత్రం ఇప్పటికి మారలేదు. అది ఏంటో తెలుసా.. రైలు పట్టాల మధ్యలో ఉన్న కంకర. దేశంలో ఏ మారుమూల రైల్వే ట్రాక్‌ను పరిశీలించిన, అందులో కంకర రాళ్లు దర్శనమిస్తాయి. వాస్తవానికి ఈ రాళ్లను ట్రాక్ బ్యాలస్ట్ అని పిలుస్తారు.
వేల టన్నుల బరువున్న రైలు పట్టాలపై వేగంగా వెళ్తున్నప్పుడు విపరీతమైన ఒత్తిడి, ప్రకంపనలు వస్తాయి. ఈ కంకర రాళ్లు ఆ బరువును సమానంగా భూమికి పంపిణీ చేస్తాయి. దీనివల్ల పట్టాలు పక్కకు జరగకుండా, భూమిలోకి కుంగిపోకుండా స్థిరంగా ఉంటాయి. అలాగే ఈ కంకర రాళ్లు చాలా వరకు శబ్ధ తీవ్రతతో పాటు కంపనాలను కూడా తగ్గిస్తాయి. వర్షం పడినప్పుడు పట్టాల మధ్య నీరు నిలిచిపోతే, కింద ఉన్న మట్టి మెత్తబడి పట్టాలు వంగిపోయే ప్రమాదం ఉంది. కానీ పట్టాల మధ్య కంకర రాళ్ల వేయడం వల్ల అందులో నుంచి ఆ వర్షం నీరు త్వరగా భూమిలోకి ఇంకిపోవడం లేదంటే పక్కకు వెళ్లిపోవడం జరుగుతుంది. ఇలా కంకర రాళ్లను పట్టాల మధ్య వేయడం వల్ల పిచ్చి, కలుపు మొక్కలు పెరిగే అవకాశం ఉండదు. మీరు ఒక విషయాన్ని గమనించారా.. రైలు పట్టాల మీద వేసే రాళ్లు సాధారణంగా గుండ్రంగా ఉండవు. అవి పదునైన అంచులతో ఉంటాయి. ఎందుకంటే కంకర రాళ్లు రౌండ్‌గా ఉంటే అవి ఒకదానిపై ఒకటి జారిపోతాయి. అదే పదునైన అంచులున్న ఉన్న రాళ్లు ఒకదానితో ఒకటి గట్టిగా లాక్ అయిపోయి, రైలు వెళ్తున్నప్పుడు కదలకుండా ఉంటాయి.
READ ALSO: Amazing Health Benefits : మీ ఇంట్లో ఈ గింజలు ఉన్నాయా? అయితే మీరు లక్కీ!
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?