NTV Telugu Site icon

Hot Topic Fog: దేశంలో ఇప్పుడు ఏం నడుస్తోందంటే?

Fog 1

Fog 1

ఒకప్పుడు నలుగురు కలిస్తే ఏం నడుస్తోంది? అనేవారు. అప్పుడంతా జనం FOG నడుస్తోంది అనేవారు. అప్పుడదే పెద్ద హాట్ టాపిక్ అయ్యేది. తాజాగా దేశమంతా కూడా FOG నడుస్తోంది. నిజంగానే పొగమంచు (FOG) కమ్ముకుంటోంది. దీంతో ఎవరిని అడిగినా ఫాగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. Fragrance కోసం యూత్ ఎక్కువగా ఫాగ్ వాడేవారు. ఇప్పుడు అసలే చలికాలం.. ఒకవైపు వణికించే చలి.. మరోవైపు కమ్ముకున్న పొగమంచు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పొగమంచు కప్పేసింది. గాలిలో నైట్రోజన్‌, ఆక్సిజన్‌ తదితర వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఎక్కువగా ఉంటుంది. దీనినే తేమ లేదా ఆర్ద్రత అంటాం. ఈ తేమ ఎంత ఉంటుందన్న విషయం గాలి పీడనం, ఉష్ణోగ్రతలను బట్టి ఆధారపడి వుంటుంది. గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తేమశాతం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే తేమ శాతం తక్కువగా ఉంటుంది. రహదారుల నిండా పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారు..

తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు కమ్మేసింది. పొగమంచు నిండుకోవడంతో ప్రధాన రహదారుల వెంబడి వెళ్తున్న వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు గ్రామాల్లో ఒక మోస్తరు మంచు ఏర్పడినా పంట పొలాల్లో ఉన్న ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. ఏపీలోని అరకు, తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. ఉదయం విధులకు హాజరయ్యే వారు, రోజువారీ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచుగా పరిగణించాలంటే, తేమ స్థాయి 70శాతం కంటే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అయితే శీతాకాలంలో తేమ తక్కువగా వున్నా పొగ కమ్ముకుంటుంది. శీతాకాలంలో ఏర్పడే పొగమంచు కారణంగా, హైవేపై వాహనాల వేగం తగ్గుతుంది. అలాగే రైళ్లు, విమానాలకు కూడా దారి తెలీదు. దీంతో అవి ఆలస్యంగా నడుస్తుంటాయి. ఒక్కోసారి పొగమంచు వల్ల విమానాలు రద్దవుతుంటాయి.

Bruma Costera.jpg

పొగమంచు అనేది ఢిల్లీలో ఎక్కువగా ఉంటుంది. అసలే కాలుష్యం దీనికి తోడు పొగమంచు ప్రభావం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పొగమంచు ఉదయం చాలా ఎక్కువగా ఉంటుంది. భూమిపై రాత్రిళ్ళు వేడి వుంటుంది. గాలిలోని నీటి ఆవిరి చల్లబడి, ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము, ధూళివంటి అతి చిన్న కణాలను ఆవరించే గాలిలో తేలియాడడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడటంతో పొగమంచు అవతలివైపు వస్తువులను మనం సరిగా చూడలేము. రహదారులు పొరలాగా కనిపిస్తాయి. అవతలి వ్యక్తి లేదా వాహనాలు సరిగా కనిపించవు. దీంతో ప్రమాదాలకు ఆస్కారం వుంటుంది. విమానాలకు ఈ ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఆకాశంలో వెళ్లే ఇతర విమానాలు వాటికి కనిపించవు. బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పొగమంచు వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వైద్యనిపుణులు.

ఏం నడుస్తోంది? FOG Uncle