Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahma Muhurta Dreams: నిద్రపోయే ప్రతి ఒక్కరికీ కలలు రావడం చాలా సహజం. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం.. మనం కనే ప్రతి కల వెనుక ఒక నిర్దిష్టమైన అర్థం, భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలు దాగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సంకేతాలు కొన్నిసార్లు మంచిని, మరికొన్నిసార్లు చెడును సూచిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా, మన ధర్మశాస్త్రాలలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ‘బ్రహ్మ ముహూర్తం’ (సూర్యోదయానికి 72 నిమిషాల ముందు వచ్చే సమయం) లో వచ్చే కలలు చాలా వరకు నిజమవుతాయని, అవి ఇంట్లోకి ధన రాకను సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే శుభప్రదమో, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రం ప్రకారం.. బ్రహ్మ ముహూర్తంలో ఒక వ్యక్తి తనను తాను ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నట్లు కలగంటే అది అత్యంత శుభప్రదమైనదిగా, సానుకూలమైనదిగా పరిగణిస్తారు.ఈ కల మీ జీవితంలో స్వేచ్ఛను, ఉన్నత శిఖరాలను అందుకోబోతున్నారనే దానికి సంకేతంగా చెబుతున్నారు. ముఖ్యంగా కెరీర్ లేదా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ కల అఖండ విజయాలను తెచ్చిపెడుతుందన్నారు. అంతేకాకుండా ఇది మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
Also Read
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
- Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
బ్రహ్మ ముహూర్తంలో వచ్చే మరికొన్ని శుభ కలలు ఇవే..
బ్రహ్మ ముహూర్త సమయంలో మీరు నదిలో పవిత్ర స్నానం చేస్తున్నట్లు లేదా మునిగి లేస్తున్నట్లు కల వస్తే అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ఎవరికైనా ఇచ్చిన అప్పులు లేదా చాలా కాలంగా నిలిచిపోయిన మీ సొమ్ము త్వరలోనే మీ చేతికి అందుతుందని ఈ కల అర్థమని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కలలో పెద్ద ధాన్యపు రాశి (అన్నం లేదా గింజల కుప్ప) కనిపించడం లక్ష్మీదేవి అనుగ్రహానికి సూచన అని చెబుతున్నారు. ఈ కల మీకు ఆకస్మిక ధనలాభం కలగబోతోందని స్పష్టం చేస్తుందన్నారు.
మీరు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇస్తున్నట్లు బ్రహ్మ ముహూర్తంలో కల వస్తే, త్వరలోనే మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, మంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని అర్థం అని చెబుతున్నారు.
సాధారణంగా పళ్లు ఊడిపోవడం చెడు సంకేతం అనుకుంటారు, కానీ స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మీ పళ్లు ఊడిపోతున్నట్లు కల రావడం చాలా మంచిదిగా పరిగణిస్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా మతపరమైన నమ్మకాలు, సాధారణ ప్రచారంలో ఉన్న అంశాలపై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
తాజావార్తలు
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!