NTV Telugu Site icon

1134 Review: 1134 రివ్యూ

1134 Review

1134 Review

1134 movie review: ఈ మధ్య కాలంలో కొత్తదనం లేకుంటే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. అయితే స్టార్ ఎట్రాక్షన్ అయినా ఉండాలి లేదంటే మంచి న్యూ ఏజ్ కంటెంట్ అయినా ఉండాలి అన్నట్టు చూస్తున్నారు. న్యూ ఏజ్ మేకర్లు కూడా ఏమాత్రం తగ్గకుండా తెరపై వండర్స్ క్రియేట్ చేసేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చిన్న చిన్న కాన్సెప్ట్‌లను సైతం సినిమాలుగా మలుస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నారు. ఇలాంటి ఓ క్రమంలోనే నో బడ్జెట్ తో చేసిన మూవీ 1134. టీజర్, ట్రైలర్ ఆసక్తి రేకెత్తించడంతో ఈ సినిమా మీద బజ్ ఏర్పడింది. దీంతో జనవరి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం పదండి.

కథ
లక్ష్మణ్ (ఫణి శర్మ), ఎరిక్ (గంగాధర్ రెడ్డి), హర్ష్ (ఫణి భార్గవ్)అనే ఈ ముగ్గురిని దుండగులు కిడ్నాప్ చేసి ఒకే దగ్గర కట్టి పడేస్తారు. ఏటీఎం వద్ద ఉండే కెమెరాలు హ్యాక్ చేస్తూ, బస్ స్టాప్‌లో బ్యాగులను దొంగతనం చేస్తూ, ఏటీఎంలో ఇల్లీగల్‌గా డబ్బులు తీస్తూ ఇల్లీగల్ గా పనులు చేస్తూ ఉండే ముగ్గురికి ఉన్న లింక్ ఏంటి? ఈ ముగ్గురు అసలు ఆ పనులు ఎందుకు చేస్తున్నారు? ఈ ముగ్గురిని కలిపి కిడ్నప్ చేసింది ఎవరు? ఈ ముగ్గరికీ ఉన్న లింక్ ఏంటి? అసలు ఈ కథలో 11 34 అంటే ఏంటి? చివరికి ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ
సాధారణంగా సినిమాలను క్రైమ్ థ్రిల్లర్ గా చూపించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 1134 మేకర్స్ కూడా క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కి రాబరి, సస్పెన్స్ లాంటి ఎలిమెంట్స్ కలిపారు. కొత్త దర్శకుడే అయినా శరత్ తాను ఎంచుకున్న పాయింట్‌ నుంచి ఏ మాత్రం కూడా డైవర్ట్ కాకుండా ఆడియన్స్ కి సూటిగా సుత్తిలేకుండా చెప్పే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. సినిమాలో కీలకమైన మూడు పాత్రల పరిచయం, వాటి తాలుకూ ఫ్లాష్ బ్యాక్, వారి వారి నేపథ్యాలు చూపిస్తూ ఫస్ట్ హాఫ్‌ కట్ చేసి ఇంటర్వెల్‌కు అదిరిపోయేలా ఒక ట్విస్ట్ రాసుకున్నాడు. ఇక తర్వాత సెకండాఫ్‌కు వచ్చే సరికి చిక్కుముడులన్నీ విప్పినట్టు ఒక్కొక్క విషయాణ్ణి రివీల్ చేస్తూ అప్పటిదాకా మెయింటైన్ చేసిన సస్పెన్స్ ను కట్ చేస్తూ వస్తారు. అసలు ఆ ముగ్గురి వెనుకున్నది ఎవరు? ఆ క్రైమ్స్‌ అన్నిటినీ చేయిస్తున్నది ఎవరు? ఎందుకు అలా చేయిస్తున్నారు అనే విషయాలు ఒక్కొక్కటీ రివీల్ చేస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ సెకండ్ హాఫ్ మొత్తం నడిపాడు. ముఖ్యముగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే కొన్ని ట్విస్టులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

నటీనటులు
నిజానికి ఒకప్పుడు కొత్త వాళ్లతో సినిమా చేయడం సాహసమే కానీ ఇప్పుడు అలంటి భావన కొంత పోయింది. అయితే ఈ సినిమా విషయంలో కొత్తవాళ్లందరూ కలిసి సినిమా చేయడం మాత్రం సాహసమే. కృష్ణగా (కృష్ణ మదుపు), ఎరిక్‌గా (గంగాధర్ రెడ్డి), హర్షగా (ఫణి భార్గవ్), లక్ష్మణ్‌గా (ఫణి శర్మ) ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. యాక్షన్, ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌ను చూపిస్తూ కొత్త వాళ్లు అనే భావన కలుగకుండా చక్కగా తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. నటులు అనే ఫీలింగ్ రాకుండా సహజంగా నటించారు. ఇక టెక్నికల్‌గా ఈ సినిమా మాత్రం హై లెవెల్లో అనిపించింది. ఈ సినిమాలోకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా పనితనం ప్రధానమైన పాత్ర పోషించాయి. భరత్ కుమార్ పాలకుర్తి నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా ప్రేక్షకుడ్ని థ్రిల్ చేసే 1134