Utsavam Movie Telugu Review : ఉత్సవం రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Regina Cassandra, Prakash Raj , Nassar, Dilip Prakash ...
- DIRECTOR: Arjun Sai
- MUSIC: Anup Rubens
- PRODUCER: Suresh Patil
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి కథ అందిస్తూనే దర్శకత్వం వహించిన సినిమా ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేయగా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది. అనేది రివ్యూలో చూద్దాం పదండి.
ఉత్సవం కథ:
సురభి నాటకాలు ప్రదర్శిస్తూ అనేక అవార్డులు అందుకున్న అభిమన్యు నారాయణ(ప్రకాష్ రాజ్) కుమారుడు అభిమన్యు కృష్ణ(దిలీప్ ప్రకాష్) ఇంజినీరింగ్ చదివి ఎలాంటి ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉంటాడు. అలాంటి అతన్ని ఏదైనా ఉద్యోగంలో సెట్ చేయాలని అభిమన్యు నారాయణ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన స్నేహితుడి ప్రేమను నిలబెట్టేందుకు ప్రయత్నించిన కృష్ణ ఆ స్నేహితుడు భార్య స్నేహితురాలు రమ(రెజీనా కసాండ్రా) సహాయంతో ఉద్యోగం సంపాదిస్తాడు. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడని తెలిసిన వెంటనే కృష్ణకు పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు అభిమన్యు తండ్రి. పెళ్లికి అంతా సిద్ధం అనుకుంటున్న సమయంలో కృష్ణతో పాటు పెళ్లికూతురు కూడా మిస్ అవుతుంది. అసలు కృష్ణ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఆరిపోయాడు? పెళ్లికూతురు ఎందుకు పారిపోయింది? చివరికి కృష్ణ పెళ్లి జరిగిందా? అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
విశ్లేషణ:
ఈ సినిమాని ముందు నుంచే నాటక బ్యాక్ గ్రౌండ్ సినిమా అని ప్రమోట్ చేస్తూ వచ్చింది సినిమా యూనిట్. అయితే అదే నాటక బ్యాక్ గ్రౌండ్ తోనే సినిమా ఉంది. సురభి నాటక పరిషత్ కేంద్రంగా కథ మొత్తం తిరుగుతుంది. అయితే దానికి ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ జోడించారు. నిజానికి నాటకాన్ని బ్యాక్ డ్రాప్ గా చేసుకుని తెలుగులో కృష్ణం వందే జగద్గురుమ్, రంగ మార్తాండ లాంటి సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాని కూడా పూర్తిగా నాటక కుటుంబాలను స్పృశిస్తూ వచ్చింది. అయితే నాటక సమాజాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నప్పుడు ఇంకా కొన్ని కుటుంబాలు నాటకాలని ప్రధానంగా చేసుకొని ఆదాయం లేకపోయినా బతుకుతున్నట్టు చూపించారు. కానీ ఎందుకు అలా చేస్తున్నారు? వారి పూర్వికులు వారికి ఎలాంటి సూచనలు ఇచ్చారు? ఎందుకు ఇంకా అలానే చేస్తున్నారు? లాంటి విషయాలను డెప్త్ గా చూపిస్తే బాగుండేది. దర్శకుడు అర్జున్ సాయి ఇలాంటి ఒక పాయింట్ ను కథాంశంగా ఎంచుకున్నందుకు మెచ్చుకోవాలి. అయితే కథగా అనుకున్నది తెరకెక్కించడంలో మాత్రం తడబడ్డాడు. స్క్రీన్ ప్లే విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఒకదాని తర్వాత ఒకటి సంబంధం లేకుండా వచ్చే సీన్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. ఇక కొన్ని సీన్స్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. కొన్ని ఎంగేజ్ చేయడంలో విఫలం అయినట్టే. అర్జున్ సతికి రచయితగా మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ.. ఆ ఆలోచనలను దృశ్య రూపకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విషయంలో తడబడ్డాడు.
నటీనటుల విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో కృష్ణ అనే కుర్రాడు పాత్రలో దిలీప్ ప్రకాష్ ఒదిగిపోయాడు. కన్నడలో ఎప్పుడో ఒక సినిమా చేసినా సరే ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో భలే నటించాడు. ఇక రెజీనా కాసాండ్రా హీరోయిన్ గా సరిగ్గా నప్పింది.. ఒకపక్క అందంగా కనిపిస్తూనే నటనతో కూడా ఆకట్టుకుంది. ఇక ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంది. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, అలీ, ఎల్.బి.శ్రీరామ్, ప్రేమ వంటి వాళ్ళు అందరూ కనిపిస్తుంటే ఫ్రేమ్ చాలా కలర్ ఫుల్ గా కనిపించింది. వారికి అందరికీ మంచి స్కోప్ ఉన్న పాత్రలు పడ్డాయి. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో రసూల్ ఎల్లోర్ మార్క్ సినిమాటోగ్రఫీ చాలా ఫ్రేమ్స్ లో కనిపించింది. అనూప్ రూబెన్స్ పాటలు కొన్ని బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆసక్తికరంగా ఉంది. ఎడిటింగ్ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
ఫైనల్లీ : ఉత్సవం…అందరికీ ఎక్కే సబ్జెక్ట్ కాదు..కానీ ఓ హానెస్ట్ అటెంప్ట్
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు