Ugly Story Review: అగ్లీ స్టోరీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: శ్రీ నందు, అవికా గోర్, రవితేజ మహదాస్యం, శివాజీ రాజా,ప్రగ్య తదితరులు
- DIRECTOR: ప్రణవ స్వరూప్
- MUSIC: శ్రవణ్ భరద్వాజ్
- PRODUCER: సుభాషిణి, కొండా లక్ష్మణ్
‘దండోరా’ సక్సెస్ తర్వాత నందు మంచి జోరుమీదున్నాడు. వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. తాజాగా శ్రీ నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నైజం అండ్ వైల్డ్ కాన్సెప్ట్‌తో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘అగ్లీ స్టోరీ’. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాషిణి, కొండా లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలు, వినూత్న రీతిలో చేసిన ప్రమోషన్‌తో ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. నేడు (మే 22, శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం…
అగ్లీ స్టోరీ కథ:
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన నేహా (అవికా గోర్)ను ఆమె మేన మావ (శివాజీ రాజా) తమ ఇంటికి తీసుకువచ్చి సొంత కూతురిలా పెంచుతాడు. వరుసకు మరదలైన నేహాపై మావయ్య కొడుకు కార్తీక్ (నందు) చిన్నప్పటి నుంచి పిచ్చి ప్రేమ, విపరీతమైన పొసెసివ్‌నెస్ పెంచుకుంటాడు. నేహ వేరే వారితో మాట్లాడినా, నవ్వినా భరించలేని సైకో మనస్తత్వం కార్తీక్‌ది. అయితే నేహాకు చిన్నతనం నుంచి తన క్లాస్మేట్, మిత్రుడైన గౌతమ్ (రవితేజ మహాదాస్యం) అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించుకుంటారు. ఆ విషయం తెలిసి కార్తీక్ మరింత సైకోలా మారి నేహాను బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బంది పెడతాడు. చివరకు నేహాకు అస్సలు ఇష్టం లేకపోయినా, కార్తీక్ పెట్టే నరకాన్ని భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో అతన్నే పెళ్లి చేసుకుంటుంది. పెళ్లైన తర్వాత కూడా నేహా మౌనంగా భర్త పెట్టే టార్చర్ అంతా భరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ రోజు నేహా రక్తపు మడుగులో పడి, ఆ తర్వాత అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? నేహా ఎక్కడికి వెళ్ళింది? ఈ కేసు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాక ఎలాంటి మలుపులు తిరిగింది? చివరకు సైకో కార్తీక్ ఏమయ్యాడు? అనేదే ఈ ‘అగ్లీ స్టోరీ’ కధ.
Also Read
విశ్లేషణ:
సమాజంలో ప్రేమ పేరుతో జరిగే దాడులు, పెళ్లి తర్వాత భార్యలపై భర్తలు చూపే అతి పొసెసివ్‌నెస్, సైకోయిజం సహా మారిటల్ కన్సేంట్ లేకపోతే ఆ బంధం ఎంత వికృతంగా మారుతుందో దర్శకుడు ప్రణవ స్వరూప్ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. పేరుకు తగ్గట్టే ఇదొక డార్క్, రా అండ్ టాక్సిక్ ఫ్యామిలీ డ్రామా. ఫస్టాఫ్ అంతా కార్తీక్ నేహాను అనేక రకాలుగా హింసించడంతోనే సాగుతుంది. పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు తీసుకున్న లైన్ బాగున్నా, ఇంటర్వెల్ వరకు హీరో సైకోయిజం చుట్టూనే సీన్లు రిపీట్ అవుతున్నట్లు అనిపించి కథనం కొంచెం స్లోగా సాగుతుంది. మధ్యలో గౌతమ్, నేహల లవ్ ట్రాక్ కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. సెకండాఫ్ లో మళ్లీ కొంతసేపు అదే టార్చర్ రిపీట్ అయినా.. నేహా కనిపించకుండా పోయి, ఇష్యూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాక కథనం కాస్త వేగం పుంజుకుంటుంది. అసలేం జరిగిందనే ఫ్లాష్‌బ్యాక్ ఆసక్తికరంగా ఉంటుంది. క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఇచ్చారు. అయితే భర్త అంతగా టార్చర్ పెడుతున్నా ఆ అమ్మాయి ఎందుకు అంత ఓపికగా భరిస్తుందో చెప్పే లాజిక్ సరిగ్గా కుదరలేదు. క్లైమాక్స్ మాత్రం ఒక పచ్చి నిజంతో, మంచి జస్టిఫికేషన్‌తో ముగుస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే నందు నెగెటివ్ షేడ్‌లో సైకో భర్తగా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్క్రీన్ మీద ఎవరు కనిపించినా.. ప్రేక్షకుల కళ్లు మాత్రం నందు సైకోయిజం మీదకే వెళ్తాయి. క్షణాల్లోనే ప్రశాంతత నుండి క్రూరత్వానికి మారే బాడీ లాంగ్వేజ్‌ను, వేరియేషన్స్‌ను అద్భుతంగా పలికించాడు. ఇన్నోసెంట్ భార్య నేహా పాత్రలో అవికా గోర్ ఇమిడిపోయింది. మాటల కంటే తన ముఖ కవళికలతో భయాన్ని, బాధను అద్భుతంగా పండించి ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించింది. రవితేజ మహాదాస్యం గౌతమ్‌గా కనిపించింది కాసేపే అయినా ఓకే అనిపించాడు. శివాజీ రాజా, ప్రగ్యా నయన్.. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే శ్రీ సాయి కుమార్ దారా సినిమాటోగ్రఫీ కథకు తగ్గ మూడ్‌ను తీసుకొచ్చింది. క్లోజప్ షాట్స్‌తో క్యారెక్టర్ల ఎమోషన్స్‌ను చక్కగా క్యాప్చర్ చేశారు. శ్రవణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు మేజర్ అసెట్. ఉత్కంఠభరిత సన్నివేశాలను తన సంగీతంతో మరింత ఎలివేట్ చేశాడు. ఎడిటింగ్ సెకండాఫ్‌లో బాగుంది కానీ ఫస్టాఫ్‌లో కొన్ని రిపీటెడ్ సీన్స్ కట్ చేయాల్సింది. దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగున్నా, కథను నడిపిన తీరులో కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి. రియా జియా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా క్వాలిటీగా ఉన్నాయి.
ఫైనల్లీ అంచనాలు లేకుండా వెళ్తే, సైకలాజికల్ అండ్ రా డ్రామాలను ఇష్టపడే వారికి ‘అగ్లీ స్టోరీ’ వన్ టైం వాచ్`
తాజావార్తలు
-
Rukmini Vasanth: బికినీ వీడియోతో షాక్ ఇచ్చిన రుక్మిణి వసంత్.. నెట్టింట హాట్ టాపిక్
-
LIC: ఎల్ఐసీ నుంచి జీవన్ సాథి పేరుతో రెండు కొత్త ప్లాన్లు.. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!