Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Ram Charan And S Shankars Game Changer Movie Review And Rating In Telugu

Game Changer Review: రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ రివ్యూ!

Published Date :January 10, 2025 , 7:49 am
By Bhargav Chaganti
  • ప్రేక్షకుల ముందుకు రామ్ చరణ్ 'గేమ్ చేంజర్'
  • దిల్ రాజు నిర్మించిన మొదటి పాన్ ఇండియా సినిమా
  • సినిమా ఎలా ఉందంటే?
Game Changer Review: రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ రివ్యూ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rating : 3 / 5

  • MAIN CAST: Ram Charan, Kiara Advani, Anjali, Samuthirakani, SJ Surya
  • DIRECTOR: S Shankar
  • MUSIC: Thaman S
  • PRODUCER: Dil Raju, Sireesh

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలున్నాయి. శంకర్ చేస్తున్న మొదటి తెలుగు సినిమా కావడం, దిల్ రాజు నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా రావడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకఅంతకూ పెరుగుతూ వెళ్లాయి. దానికి తోడు సినిమా రిలీజ్ లేట్ అవడం, ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ఆసక్తి పెంచడంతో సినిమా ఎలా ఉంటుందో అని మెగా ఫాన్స్ తో పాటు సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ:
రామ్ నందన్(రామ్ చరణ్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. తన ప్రియురాలు దీపిక (కియారా అద్వానీ) కోరిక మేరకు ఐఏఎస్ అవుతాడు. విశాఖలో పోస్టింగ్ రావడంతో మొదటి రోజే మీటింగ్ పెట్టి అక్కడి అధికారులకు, క్రిమినల్స్, క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్ లకు షాక్ ఇస్తాడు. అయితే ఈ క్రమంలోనే మంత్రి బొబ్బిలి మోపిదేవి ( ఎస్జే సూర్య) వ్యాపారాలు కూడా దెబ్బ తింటాయి. ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి ( శ్రీకాంత్) కొడుకు కూడా అయిన మోపిదేవి తండ్రిని చంపి తానే సీఎం అవ్వాలని అనుకుంటాడు. అయితే తన మరణం తరువాత ముఖ్యమంత్రిగా రామ్ నందన్ ను చేయాలని వీడియో సందేశం పెట్టీ సత్యమూర్తి చనిపోవడం చచ్చినయాంశమవుతుంది. అయితే సత్యమూర్తి కోరిక మేరకు రామ్ నందన్ ముఖ్యమంత్రి అవుతాడా? సీఎం అవ్వడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న మోపిదేవి ముఖ్యమంత్రి అయ్యాడా? అసలు సత్యమూర్తి రామ్ నందన్ ను ముఖ్యమంత్రిగా చేయాలని ఎందుకు అనుకున్నాడు? ఇక కథలో అప్పన్న (రామ్ చరణ్), పార్వతి (అంజలి) పాత్రలు ఏమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :
గేమ్ చేంజర్ పేరుకు తగ్గట్టుగానే ఒక పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్.. ఒక ఐఏఎస్ అధికారికి పొలిటికల్ లీడర్ కు మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ గేమ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు శంకర్. సాధారణంగానే శంకర్ సినిమాలు అంటే జనాన్ని తట్టి లేపేలా, ఆలోచింపచేసేలా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో కూడా అలాంటి పాయింట్స్ ఉన్నాయి. నిజానికి సినిమా కథ కొత్తది ఏమీ కాదు. కాకపోతే స్క్రీన్ ప్లేతో దాన్ని కొత్తగా చెప్పే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు శంకర్. నిజానికి శంకర్ పొలిటికల్ సినిమా అంటే ప్రేక్షకులు ఎంతో అంచనాలు పెట్టుకుని ధియేటర్లకు వస్తారు. ఆ అంచనాలను ఈ సినిమా కొంత వరకు అందుకుంది. అయితే సినిమా ఊహకు దగ్గరగా ఉండడం కొంత ఇబ్బందిక్రమే అయినా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విషయంలో డైరెక్టర్ శంకర్ చాలావరకు సఫలమైనట్లే. ఫస్టాఫ్ రామ్ చరణ్ లవ్ లైఫ్, అతని ట్రాన్స్ఫర్మేషన్ వంటి విషయాల మీద కేర్ తీసుకున్నారు. ఇంటర్వెల్ ముందు మాత్రం లాజిక్స్ ని క్వశ్చన్ చేసేలా ఒక ట్విస్ట్ తో ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అసలు కథ మొదలవుతుంది. సినిమాలో అప్పన్న ఎపిసోడ్ అన్ని సీక్వెన్స్ ల కంటే బాగా పేలింది. ఆ ఎమోషన్స్ అన్నీ సరిగ్గా వర్కౌట్ అయ్యాయి. ఇక డబ్బు లేని రాజకీయం అనే కాన్సెప్ట్ మెగా ఫాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రికి ఐఏఎస్ అధికారికి మధ్య పెట్టిన తగవు ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనే విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. నిజానికి హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ సీన్, ఫ్లాష్ బ్యాక్, సాంగ్స్ అన్నీ సినిమాకి ప్రధానమైన ప్లస్ పాయింట్స్. ఊహకు అందే సగటు కథ- కథనం విషయంలో కూడా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

నటీనటుల విషయానికి వస్తే:
ఈ సినిమాలో రామ్ చరణ్ అప్పన్న, రామ్ నందన్ అనే రెండు పాత్రలు పోషించారు. అందులో ఒకటి యంగ్ ఆఫీసర్ లుక్ లో రామ్ చరణ్ కనిపించగా అప్పన్న అనే ఒక విలేజర్ లుక్ లో కూడా కనిపించారు. ఇక రెండు లుక్స్ తో భిన్నమైన పాత్రలలో ఆయన అలరించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రామ్ చరణ్ గేమ్ అనిపించేలా చాలా సీన్స్ లో నటించాడు. నిజానికి అప్పన్న పాత్రకు పెట్టిన ఒక చిన్న లోపంతో ఆ పాత్ర నటించే విషయంలో రామ్ చరణ్ కి మరింత బాధ్యత పడిందని చెప్పొచ్చు. అలాగే రామ్ నందన్ లుక్ మాత్రం అదిరిపోయింది. యాక్టింగ్ విషయంలో కూడా రామ్ చరణ్ కి వంకలు పెట్టే అవకాశం లేకుండా ఆయన రెండు పాత్రలను పోషించాడు. అంజలి పాత్రకు ప్రాధాన్యత ఉంది కానీ చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. కియారా అద్వానీ పాత్ర ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది కానీ ఉన్నంతలో గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక సినిమాలో చాలామంది నటీనటులు కనిపించారు కానీ ఎస్ జె సూర్య- రామ్ చరణ్ కాంబినేషన్ సీన్లు మాత్రం అదిరిపోయాయి. ఒకరికొకరు పోటా పోటీగా నటించారు. ఇక శ్రీకాంత్ కి కూడా చాలా కాలం తర్వాత బరువైన పాత్ర పడింది . అంతే ఈజ్ తో ఆయన తన అనుభవంతో నటించాడు. రాజీవ్ కనకాల, సముద్ర కని, సునీల్, సీనియర్ నరేష్, కంచరపాలెం కిషోర్ వంటివాళ్లు తమ పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రియదర్శి, వైవాహర్ష, కమెడియన్ సత్య ఇలా ప్రస్తుతం హీరోలుగా కూడా సినిమాలు చేస్తున్న వాళ్లు ఈ సినిమాల్లో కేవలం రెండు మూడు సీన్లకే పరిమితమయ్యారు. వారినీ మరింత వాడుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. మామూలుగానే శంకర్ సినిమాలంటే ఒక రేంజ్ లో ఉంటాయి. ఆ స్థాయిని మరింత పెంచేలా ఈ సినిమాటోగ్రఫీ కనిపించింది. అలాగే తెలుగులో వ్రాసిన డైలాగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. కొన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి. సాంగ్స్ తెరమీద చూడటానికి చాలా రిచ్ గా అలాగే కన్నుల విందుగా ఉన్నాయి. ఎడిటింగ్ మీద మరింత కేర్ తీసుకుని ఉండవచ్చు. ఇక తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి బాగా ఉపయోగపడింది. సినిమాను ఎలివేట్ చేయడంలో ఉపయోగపడింది. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేముంది? సినిమాకు కావలసినంత ఖర్చుపెట్టినట్లు అనిపించింది.

ఫైనల్లీ:
ఫైనల్ గా గేమ్ చేంజర్ ‘రామ్ చరణ్’ గేమ్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Game Changer
  • Game Changer Rating
  • Game Changer Review
  • Ram Charan
  • S Shankar

తాజావార్తలు

  • SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

  • Kavitha : BRSలో కలవరానికి కారణమవుతున్న కవిత మాటలు

  • Chandigarh Blast: బీజేపీ ఆఫీస్ పేలుడు ఘటన వెనక పాక్ ఐఎస్ఐ హస్తం.. ఐదుగురు అరెస్ట్..

  • Hydra: ‘ఆ ఇళ్ల జోలికి వెళ్లం’.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా..

  • Story Board: ఆర్థిక సంక్షోభం దిశగా అమెరికా.. ఇండియాలో తప్పని కష్టాలు.. యుద్ధం అందర్నీ ముంచేస్తోందా..?

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions