రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ శంకర్ భారతీయుడు కమిట్మెంట్స్ కారణంగా అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రచారం జరిగిన ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా జనవరి…