Premaki Jai Review: ‘ప్రేమకు జై’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Anil Buragani, Jwalitha and others
- DIRECTOR: Srinivas Mallam
- MUSIC:
- PRODUCER: Anasurya
ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అని మన కవులు అప్పట్లో పాటలు రాశారు. కానీ, ఇప్పటి పరిస్థితుల్లో ప్రియురాలు వేరే కులం అయితే, ఆమె తల్లిదండ్రులు అంతకంటే కఠినంగా ఉంటున్నారు. ఎంతో అభివృద్ధి సాధించినా సరే, ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కులాల కారణంగా పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు పరువు హత్యల కేసులు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ పరువు హత్యలను ప్రధాన అంశంగా తీసుకుని ‘ప్రేమకు జై’ అనే సినిమా రూపొందింది. అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో, అనసూర్య నిర్మించిన ‘ప్రేమకు జై’ తాజాగా ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన జై (అనిల్) హీరో కావాలని కలలు కంటాడు. తన గ్రామానికి చెందిన ప్రేమ (జ్వలిత) అనే అమ్మాయితో ప్రేమలో పడినా, ఆమె తండ్రి మాత్రం వీరి రిలేషన్‌కు ఒప్పుకోడు. అయితే, తనను తాను నిరూపించుకోవాలని నిశ్చయించుకున్న జై, జీవితంలో విజయం సాధించి, ప్రేమను వివాహం చేసుకోవడానికి తిరిగి వస్తానని బయలుదేరి వెళతాడు. అయితే, ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉన్న జై, ఊరిలో ఉన్న ప్రేమ ఒకేసారి కన్ను మూస్తారు. ఇంతకీ ఏం జరిగింది? వారు ఎలా కన్ను మూశారు? అనే విషయాలు తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
ఇది పరువు హత్యల నేపథ్యంలో రూపొందిన సినిమా. నిజానికి, ఈ నేపథ్యంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, అందులో ఒక కొత్త ప్రయత్నంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. తెలుగులో ట్రాజిక్ ఎండింగ్ సినిమాలను ప్రేక్షకులు సాధారణంగా ఆదరించరు. కానీ, ఆ విషయంలో కూడా ధైర్యం చేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పరువు పేరుతో చేసే హత్యలవల్ల పరువు దక్కుతుందనుకోవడం మూర్ఖత్వం. హంతకులనే ముద్ర పడటంవల్ల పరువు పోతుంది, కానీ పరువు రాదనే బలమైన సందేశాన్ని సమాజానికి అందిస్తూ డైరెక్టర్ శできます。ీనివాస్ మల్లం ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు తాను అనుకున్న కథను ఎలాంటి కమర్షియల్ హంగులకు వెళ్లకుండా తెరపై ఆవిష్కరించడంలో సఫలమయ్యాడనే చెప్పాలి. నేటి సమాజానికి, యువతకు, వారి తల్లిదండ్రులకు ఈ సినిమా ద్వారా మంచి సందేశం ఇచ్చేలా తీర్చిదిద్దారు శ్రీనివాస్ మల్లం. కామెడీ, ఎమోషన్, పాటలు, ఫైట్లు ఇలా అన్నీ ఉండేలా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
నటీనటులు:
హీరోగా నటించిన అనిల్ బురగాని మొదటి సినిమా అయినప్పటికీ, తన పాత్రలో ఒదిగిపోయాడు. పాటల్లో, డాన్స్‌లో, ఫైటింగ్ సీన్లలో మంచి సౌలభ్యం కనబరిచాడు. ఇక హీరోయిన్ జ్వలిత స్క్రీన్ మీద చాలా క్యూట్‌గా కనిపించింది. విలన్ పాత్రలో భాస్కర్ దుబ్బాక నటన ఆకట్టుకునేలా ఉంది. ఆనంద్, సద్దామ్ సహా మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. ఉరుకుందా రెడ్డి ప్రతి సీన్‌ను చాలా సహజంగా షూట్ చేశారు. మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్లకు తగ్గట్టే సెట్ అయింది. ఎడిటింగ్ పరవాలేదు, అక్కడక్కడ కొన్ని కట్స్ చేస్తే ఇంకా బాగుండేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరిగా ఈ తరం యువత, వారి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది.
- Tags
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్‌ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్‌ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్‌ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!