O Kala Movie Review: ఓ కల (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Keshav Deepak, Roshni Sahota,Gourish Yeleti
- DIRECTOR: Deepak Kolipaka
- MUSIC: Neelesh Mandalapu
- PRODUCER: Navyya Mahesh, Ranjith Kumar Kodali
O Kala Movie Review: కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కు ఓటీటీ కరెక్ట్ ప్లాట్ ఫామ్. అలాంటి ఓ చక్కని కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఓ కల’. ఈ మూవీ 13వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గౌరీష్ యేలేటి, రోష్ని సహోట, ప్రాచి టక్కర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను దీపక్ కొలిపాక దర్శకత్వంలో నవ్య మహేశ్, రంజిత్ కుమార్ కొడాలి నిర్మించారు.
ఎం.బి.ఎ. చేసిన హారిక (రోష్ని)కు ఉద్యోగం చేయడం కంటే… తన ప్రతిభను ఉపయోగించి సొంత కంపెనీ పెట్టి ఓ వంద మందికి ఉపాధి కల్పించాలనే కోరిక. అందుకు తండ్రి (దేవి ప్రసాద్) సైతం సహకరిస్తాడు. స్నేహితుడు శరణ్ తో కలిసి బిజినెస్ లోకి దిగిన హారిక… అతన్ని నమ్మి మోసపోతుంది. నష్టాల్లో మునిగిపోయిన కంపెనీని వేరే వాళ్ళకు అమ్మేసి, డిప్రషన్ తో సూసైడ్ చేసుకోవాలని అనుకుంటుంది. ఆ సమయంలో ఆమె జీవితంలోకి హర్ష (గౌరీష్ యేలేటి) అడుగు పెడతాడు. లైఫ్ మీద హోప్ కోల్పోయిన హారికలో హర్ష ఎలా ఆశలు రేకెత్తించాడు? ఆమెను మళ్ళీ ఎలా సక్సెస్ ఫుల్ ఎంటర్ పెన్యూర్ గా మలిచాడు? హర్ష గతం ఏమిటీ? అనేదే ఈ చిత్రం.
Also Read
ఓ చిన్న పాయింట్ ను తీసుకుని దర్శకుడు దీపక్ కొలిపాక చక్కని దృశ్య కావ్యంగా దీన్ని మలిచాడు. ఇవాళ సమాజంలో పది శాతం మంది డిప్రషన్ కు లోనవుతున్నారు. సూసైడ్ చేసుకుంటున్న వారిలో తొంభై శాతం మంది ఆ డిప్రషన్ కారణంగానే అందుకు పాల్పడుతున్నారు. వాళ్ళలో చిన్న పాటి ఆశను సకాలంలో కల్గిస్తే… వాళ్ళకో కొత్త జీవితాన్ని ప్రసాదించినట్టు అవుతుంది. అలాంటి ప్రయత్నం సమాజంలో కొంత మేర జరుగుతోంది. కానీ అది మరింతగా జరగాలన్నదే ఈ సినిమా ద్వారా దర్శకుడు దీపక్ చెప్పాలనుకున్నాడు. దానికి తగ్గట్టు గా సింపుల్ గా ఓ స్టోరీని రాసుకున్నాడు. అన్ని వర్గాలను ఆకట్టుకోవాలనే అత్యాశకు పోకుండా… తను రాసుకున్న కథకు తగిన న్యాయం చేస్తూ, మంచి నటీనటులను ఎంపిక చేసుకుని, ఈ క్యూట్ మూవీని తెరకెక్కించాడు.
ఇందులో ప్రధానంగా కనిపించేవి రెండే పాత్రలు. గౌరీశ్ యేలేటీ అండ్ రోష్ని. ఇద్దరూ చక్కగా నటించారు. మరీ ముఖ్యంగా… ఇప్పటికే ఉత్తరాదిన నటిగా గుర్తింపు తెచ్చుకున్న రేష్ని చాలా బాగా తన పాత్రను పోట్రేట్ చేసింది. ప్రత్యూష పాత్రకు ప్రాచీ టక్కర్ తగిన న్యాయం చేసింది. అయితే రోష్ని పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో ప్రాచీ పాత్ర పట్ల దర్శకుడు కాస్తంత శీతకన్ను వేశాడనిపిస్తుంది. ఇతర ప్రధాన పాత్రలను దేవి ప్రసాద్, వైవా రాఘవ, శక్తి, రవితేజ, కృష్ణకుమారి శ్రీపతి పోషించారు. ఫిల్మ్ డైరెక్టర్ గా అలీ చేసిన పాత్ర పెద్దంత మెప్పించలేదు. ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ, నీలేష్ మండలపు సంగీతం. కశ్మీర్ అందాలను అఖిల్ తన కెమెరాలో చక్కగా బంధించాడు. నేపథ్య గీతాలు వినసొంపుగా ఉన్నాయి. వీటిని కృష్ణ చైతన్య, రాకేందు మౌళి రాశారు. సినిమా అనేది ప్రధానంగా వినోదసాధనమే అయినా దాని ద్వారా సమాజ హితానికి పాటు పడటం ఉత్తమ లక్షణం. అది తమకుందని ‘ఓ కల’ ద్వారా దర్శక నిర్మాతలు చాటి చెప్పారు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా… ఓటీటీలోని ఈ సినిమాను చూస్తే… మనసుకు హాయిగా ఉంటుంది. లోపల ఎక్కడైనా డిప్రషన్ ఉంటే… తొలగిపోతుంది!
రేటింగ్ : 2.5/5
ప్లస్ పాయింట్స్
ఉదాత్తమైన కథ
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
అఖిల్ సినిమాటోగ్రఫీ
మైనెస్ పాయింట్స్
ఊహకందే ముగింపు
ఫ్లాట్ నెరేషన్
ట్యాగ్ లైన్: కలలాంటి సినిమా!
తాజావార్తలు
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
Tamil Nadu: మహిళా కలెక్టర్కు అసభ్యకర సందేశాలు.. టీవీకే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్..!
-
Hyderabad Green Tankers: గ్రీన్ ట్యాంకర్ల పేరుతో మురుగు నీటి సరఫరా కలకలం.. ఖాజాగూడలో ఏం జరుగుతోంది?
-
Punjab BJP-SAD Alliance 2027: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. మళ్లీ చేతులు కలిపిన బీజేపీ-అకాలీదళ్!
-
AP Panchayat Elections: ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
ట్రెండింగ్
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్లో ప్రత్యక్షమైన iQOO 16..!