గత కొంతకాలంగా సరైన హిట్స్ లేకుండా ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్ తాజాగా మట్కా అనే ఒక కమర్షియల్ ఎంటర్ప్రైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాని రామ్ తాళ్ళూరికి చెందిన ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించారు. గతంలో భిన్నమైన సినిమాలు డైరెక్ట్ చేసిన కరుణకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పరచుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మన రివ్యూ లో చూద్దాం..
కథ:
దేశంలో గొడవలు కారణంగా బర్మా నుంచి విశాఖ వచ్చిన శరణార్థి వాసు (వరుణ్ తేజ్) అక్కడే శరణార్థి శిబిరంలో ప్రసాద్ (‘సత్యం’ రాజేష్)కి స్నేహితుడు అవుతాడు. అయితే ఆ సమయంలో జరిగిన ఓ గొడవ వల్ల చిన్నతనంలో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత పూర్ణ మార్కెట్టులో అప్పల్ రెడ్డి (అజయ్ ఘోష్) షాపులో పనికి చేరతాడు. కొబ్బరికాయల కొట్టులో పని చేసే వాసు సుజాత (మీనాక్షి చౌదరి)తో ప్రేమలో ఎలా పడ్డాడు? ఆ తర్వాత జీవితంలో ఎలా ఎదిగాడు? దేశం మొత్తాన్ని నడిపే మట్కా కింగ్ ఎలా అయ్యాడు? అసలు మట్కా అంటే ఏమిటి? వాసు ప్రయాణంలో ఎంపీ నాని బాబు (కిశోర్), సోఫియా (నోరా ఫతేహి), కేబీ (జాన్ విజయ్) పాత్రలు ఏమిటి? వాసుని సీబీఐ ఎందుకు టార్గెట్ చేసింది? సీబీఐ అధికారి సాహు (నవీన్ చంద్ర) వాసును పట్టుకోగలిగాడా? లేదా? చివరకు అసలు ఏమైంది? అనేది బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
కథగా చూస్తే ఇది కొత్త కథ ఏమీ కాదు తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే పదుల సంఖ్యలో ఇలాంటి కథలు చూసారు. అదే కమర్షియల్ ఫార్మటులో ఈ సినిమా కథను కూడా చెప్పాలని ట్రై చేశారు కానీ ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యేలా చెప్పడంలో మాత్రం తడబాటు కనిపించింది. నిజానికి ఈ సినిమాలో ప్రేక్షకులకు కాస్త చివరి దాకా కాస్త ఆసక్తి కలిగించిన అంశం ఏదైనా ఉంది అంటే అది మట్కా ఆట.. అసలు ఆట ఆలోచన ఎలా వచ్చింది? దేశం మొత్తాన్ని దాన్ని ఎలా విస్తరించారు? ఈ మట్కా ఆట అనేది పోలీసులకు కూడా చిక్కకుండా ఒక నెట్వర్క్ మొత్తాన్ని ఎలా నడిపారు? అనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే కథలో పాత్రలు, హీరో క్యారెక్టరైజేషన్ రెండూ మన వాళ్లకు బాగా అలవాటు అయినవే. కట్టుబట్టలతో వేరే ప్రాంతానికి బతకడానికి వెళ్లిన హీరో కోట్లాది కోట్లకు అధిపతి కావడం, తన ప్రమేయంతో వేల కోట్ల నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఎలా స్వైర విహారం చేశాడు అనేదే ఈ సినిమా కథ.. అయితే టైటిల్ ఉన్నట్టే ‘మట్కా’ కథ. ఇంటర్వెల్ వరకు అసలు మొదలు కాలేదు. ఆ తరువాత సెకండాఫ్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదు. ఈజీగా ఊహకు దగ్గరగా రాసుకున్న సీన్లు ఏమాత్రం ఎగ్జైట్ చెయ్యవు.
నటీనటుల గురించి మాట్లాడాల్సి వస్తే:
వాసు అనే పాత్రలో జీవించాడు నటుడిగా వివిధ దశల్లో వాసు పాత్రను ఆవిష్కరించిన తీరు మాత్రం ఔరా అనకుండా అనలేం. నటనలో ఇంటెన్స్, డైలాగ్ డెలివరీలో ఉన్న స్పీడ్ ఆకట్టుకుంది. సుజాతగా మీనాక్షి చౌదరి డీ గ్లామర్ రోల్ లో కనిపించింది. ఆమె పాత్రకు ప్రాధాన్యత లేదు.నోరా ఫతేహి కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం కాకుండా ఉన్నంతలో ఆకట్టుకుంది. సలోని, కిశోర్, జాన్ విజయ్, ‘సత్యం’ రాజేశ్, నవీన్ చంద్ర వంటి వాళ్ళు తమ తమ పాత్రలు తగ్గట్టు న్యాయం చేశారు. అయితే ఇందిరా గాంధీ పాత్రలో భలే క్యాష్టింగ్ కుదిరింది..మరోపక్క టెక్నికల్ అంశాల విషయానికి వచ్చేసరికి పాటలు పెద్దగా కట్టుకోలేదు. కానీ కొన్ని సన్నివేశాల్లో జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం బాగా వర్కౌట్ అయింది. కెమెరా పనితనం సినిమాకి అదనపు అందాన్ని తీసుకు వచ్చింది. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ ఈ సినిమాకి అసలైన ఊపిరి పోసింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఫైనల్లీ:
ఈ మట్కా రొటీన్ కమర్షియల్ క్రైమ్ డ్రామా.